Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ లో జంప్ జలానీలతో కేసీఆర్ లో పట్టుకున్న భయం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుంది. గతంలో కాంగ్రెస్ వారిని బీఆర్ఎస్ నేతలు ఆకర్షించినట్లే ఇప్పుడు సీన్ రివర్స్ గా మారింది.

By:  Tupaki Desk   |   21 Dec 2023 4:58 AM GMT
బీఆర్ఎస్ లో జంప్ జలానీలతో కేసీఆర్ లో పట్టుకున్న భయం
X

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుంది. గతంలో కాంగ్రెస్ వారిని బీఆర్ఎస్ నేతలు ఆకర్షించినట్లే ఇప్పుడు సీన్ రివర్స్ గా మారింది. పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వారితో టచ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. తమ పార్టీకి ఏదో ముప్పు వాటిల్లుతుందనే బెంగ పట్టుకుంది. ఈనేపథ్యంలో పార్టీ మారే వారిని గుర్తించి వారితో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం తరువాత కొందరు ఎంపీలు కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నట్లు సమాచారం. దీంతో నలుగురు ఎంపీలు కాంగ్రెస్ వారితో మాట్లాడుతున్నట్లు కేసీఆర్ కు తెలియడంతో వారిని పార్టీని వీడకుండా చర్యలు చేపడుతున్నారు. వారిని తక్షణమే ఢిల్లీ నుంచి వచ్చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. పార్టీ మారకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారనే భావిస్తున్నారు. మెదక్ స్థానంపై పలువురికి గురి ఉండటంతో రాజకీయం రసవత్తరంగా మారనుంది. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కెప్టెన్ విజయరఘునందన్ రావులు బరిలో నిలవాలని చూస్తున్నాట్లు సమాచారం. మొత్తానికి మెదక్ రాజకీయం అందరిలో ఆసక్తి రేపుతోంది.

బీఆర్ఎస్ ఎంపీలు జంపు జలానీలుగా మారతారనే వార్త కేసీఆర్ మనసులో కలవరం పెంచుతోంది. లోక్ సభ ఎన్నికల కోసం వ్యూహాలు ఖరారు చేస్తున్నట్లు చెబుతున్నారు. గెలుపు గుర్రాల కోసం కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. దీని కోసమే సమర్థులైన వారి కోసం పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా పట్టు నిలుపుకోవాలని చూస్తోంది.

ఇదివరకు ఉన్న ఎంపీల స్థానంలో కొత్త వారిని నిలబెట్టాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీలోని కొందరు ఎంపీలు కాంగ్రెస్ తో రాయబారాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. వారు కాంగ్రెస్ లోకి వెళితే పరువు పోతుందనే వాదనలు కూడా వస్తున్నాయి. గతంలో వారు చేసిన పాపమే ఇప్పుడు వారిని వెంటాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి గల కారణాలు తెలుసుకుని మళ్లీ అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలని కేసీఆర్ భావిస్తున్నారు.