Begin typing your search above and press return to search.

కారు పార్టీ దూసుకుపోయిందా ?

నిజమే కారు పార్టీ దూసుకుపోవడం నిజమే. అయితే ఎందులో అంటే ఎలక్టోరల్ బాండ్ల విరాళాల్లో

By:  Tupaki Desk   |   16 Feb 2024 5:30 AM GMT
కారు పార్టీ దూసుకుపోయిందా ?
X

నిజమే కారు పార్టీ దూసుకుపోవడం నిజమే. అయితే ఎందులో అంటే ఎలక్టోరల్ బాండ్ల విరాళాల్లో. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలు విరాళాలను సేకరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. రాజకీయపార్టీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు సేకరించటం అవినీతిని ప్రోత్సహించినట్లవుతుందని ఐదుగురు జడ్జీల ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. ఇప్పటివరకు పార్టీలు సేకరించిన ఎలక్టోరల్ బాండ్ల విరాళాలను తిరిగి వెనక్కిచ్చేయాలని ఆదేశించింది. ఇకముందు ఏ పార్టీ కూడా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు సేకరించకూడదని తీర్పిచ్చింది.

సుప్రింకోర్టు తాజా తీర్పు, వ్యాఖ్యలు దేశంలో సంచలనంగా మారింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాల సేకరణలో అత్యధికంగా లబ్దిపొందింది బీజేపీనే. గడచిన తొమ్మిదేళ్ళల్లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అన్నీపార్టీలు కలిపి సుమారు రు.16,500 కోట్ల విరాళాలు సేకరించాయి. ఇందులో సుమారు రు. 10 వేల కోట్ల బీజేపీకి మాత్రమే వచ్చాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లను సేకరించింది బీఆర్ఎస్ పార్టీనే. 2017-23 సంవత్సరాల మధ్య 913 కోట్లను విరాళాలుగా కారుపార్టీ సేకరించింది.

ఇలా సేకరించిన విరాళాల్లో 2022-23లోనే రు. 529 కోట్లను సేకరించటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లోనే అత్యధిక ఎలక్టోరల్ బాండ్లను సేకరించిన పార్టీ కారుపార్టీ మాత్రమే. అన్నీ ప్రాంతీయ పార్టీల్లో కారుపార్టీ రిచ్చెస్టు పార్టీగా చెప్పుకోవాల్సిందే. దేశవ్యాప్తంగా అన్నీ రాజకీయపార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విరాళాల్లో బీఆర్ఎస్ వాట 7.61 శాతం. ఎలక్టోరల్ బాండ్ల రూపంలోనే కాకుండా ఎలక్టోరల్ ట్రస్టుల రూపంలో కూడా బీఆర్ఎస్ విపరీతంగా విరాళాలను సేకరించింది.

ఎలక్టోరల్ ట్రస్టుల నుండి సేకరించిన విరాళాల్లో బీఆర్ఎస్ ది మూడోస్ధానం. 2022-23 ఆడిట్ రిపోర్టు ప్రకారం సొంత నేతలు, పారిశ్రామికవేత్తలకు చెందిన ఎలక్టోరల్ ట్రస్టుల నుండి సేకరించిన విరాళాలు రు. 65 కోట్లు. ఎలక్టోరల్ బాండ్లు, ఎలక్టోరల్ ట్రస్టులు, వివిధ రూపాల్లో ఏడాదిలో అందిన విరాళాలు మొత్తం రు.ప 683 కోట్లు. అంటే ఏ రకంగా చూసుకున్నా కారు పార్టీ విరాళాల సేకరణలో బాగా స్పీడుగా దూసుకుపోయిందనే చెప్పాలి. కాకపోతే ఇపుడా విరాళాలను వెనక్కిచేయాలని సుప్రింకోర్టు తీర్పు పరిణామాలు ఎలాగుంటుందో చూడాలి.