Begin typing your search above and press return to search.

ఎవరు చేయగలిగేది ఏమీ ఉండదు!

అయితే 2014లో అధికారంలోకి వచ్చిన కేసీయార్ అసలు ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించను కూడా లేదు

By:  Tupaki Desk   |   19 Jan 2024 4:28 AM GMT
ఎవరు చేయగలిగేది ఏమీ ఉండదు!
X

తొందరలోనే బీఆర్ఎస్ కు షాక్ తప్పేట్లులేదు. ఎందుకంటే బీఆర్ఎస్ తరపున రాజేంద్రనగర్ లో ఎంఎల్ఏగా గెలిచిన ప్రకాష్ గౌడ్ ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళారు. వీళ్ళిద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. మొదటి బండ్లగూడలోని స్వామిగౌడ్ ఇంటికి వెళ్ళారు. అక్కడి నుండి ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ ఇంటికి వెళ్ళారు. స్వామిగౌడ్ బీఆర్ఎస్ తరపున శాసనమండలి ఛైర్మన్ గా పనిచేసిన విషయం తెలిసిందే. తర్వాత స్వామి అనుకున్నట్లుగా కేసీయార్ టికెట్ ఇవ్వని కారణంగా రాజీనామా చేసేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరినా ఎక్కువ కాలం ఉండలేదు.

అందుకనే ఇపుడు మంత్రి పొన్నం స్వామిగౌడ్ ఇంటికి వెళ్ళారు. సరే వీళ్ళద్దరితో మంత్రి భేటీ అవగానే బీఆర్ఎస్ ఎంఎల్ఏ కాంగ్రెస్ లోకి చేరబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ప్రకాష్, స్వామి గౌడ్ ను కాంగ్రెస్ లోకి రావాలని మంత్రి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ప్రకాష్ గౌడ్ గనుక కాంగ్రెస్ లో చేరటానికి సుముఖత చూపితే బీఆర్ఎస్ కు షాక్ మొదలైనట్లే. ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరటానికి ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ఒకవేళ ప్రకాష్ కాంగ్రెస్ లో చేరినా కేసీయార్ చేయగలిగింది కూడా ఏమీలేదు. ఎందుకంటే ఇలాంటి పార్టీల ఫిరాయింపులను టోకుగా మొదలుపెట్టిందే కేసీయార్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పార్టీలు మారటలు జరిగాయి. అయితే అప్పట్లో పార్టీ మారిన టీఆర్ఎస్ ఎంఎల్ఏలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో మళ్ళీ పోటీచేశారు. అలా ఏడుగురు ఎంఎల్ఏల్లో నలుగురు గెలిచి ముగ్గురు ఓడిపోయారు.

అయితే 2014లో అధికారంలోకి వచ్చిన కేసీయార్ అసలు ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించను కూడా లేదు. కాంగ్రెస్, టీడీపీల తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో చాలామందిని లాగేసుకున్నారు. కాబట్టి ఇపుడు బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి వెళ్ళినా ఎవరు చేయగలిగేది ఏమీ ఉండదు. మహాయితే పార్టీ ఫిరాయించిన వాళ్ళపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ ను కోరుతుందంతే. స్పీకర్ ఆ ఫిర్యాదుపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కాలయాపన చేస్తుంటారు. ఎందుకంటే కేసీయార్ చేయించింది కూడా ఇదే కాబట్టి.