Begin typing your search above and press return to search.

యాభై సీట్లు వస్తే బీయారెస్ దే అధికారమా..?

అదే టైం లో బీయారెస్ కి జస్ట్ యాభై సీట్లు వచ్చినా కూడా అధికారం దక్కుతుందా అంటే అవును అనే విశ్లేషకుల అంచనాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   24 Nov 2023 2:51 AM GMT
యాభై సీట్లు వస్తే బీయారెస్ దే అధికారమా..?
X

తెలంగాణాలో ఎవరిది అధికారం అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అయితే కాదు. ఎందుకంటే ఇపుడు రెండే రెండు పార్టీలు అధికారం అంచున నిలబడి ఉన్నాయి. ఒకటి అధికార బీయారెస్. మరొకటి కాంగ్రెస్. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. ఆ పార్టీ నేతలు అంతా ఐక్యంగా రంగంలోకి దిగుతున్నారు.

ఇక ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ కి ఒక్క చాన్స్ ఇద్దామన్న భావన జనాలలో ఉంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పట్ల యువత మహిళలు పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ గాలి ఎలా ఉంది అంటే ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సభలకు జనాలు వెల్లువెత్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అర్ధమయ్యేలా చెబుతూనే ఫైర్ బ్రాండ్ గా స్పీచ్ ని ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణాలో ఇంకా మాదే అధికారం అని బీయారెస్ అంటోంది. దానికి అనేక లెక్కలు ఉన్నాయని అంటున్నారు. తాజాగా కేటీయార్ మాట్లాడుతూ రెండవ స్థానం కోసమే పోటీ జరుగుతోంది తప్ప ఫస్ట్ ప్లేస్ కేసీయార్ వద్దనే ఉంది అని చెప్పుకొచ్చారు. ఆ మధ్య దాకా సెకండ్ ప్లేస్ లో మేమున్నామని బీజేపీ అనుకుంటే ఇపుడు ఆ ప్లేస్ లోకి కాంగ్రెస్ వచ్చిందని ఆయన విశ్లేషించించారు.

అంతే తప్ప రెండు పార్టీలలో ఏ ఒక్కటీ కూడా మొదటి ప్లేస్ లోకి వచ్చే సీన్ లేదని తేల్చేశారు. ఎందుకంటే రెండవ ప్లేస్ కి మొదటి ప్లేస్ కి మధ్య చాలా గ్యాప్ ఉందని ఆయన అంటున్నారు. సరే బీయారెస్ కి ఇది ఒక ధీమా కావచ్చు అయినా సరే కాంగ్రెస్ ని బీజేపీని సరిపోల్చడం తగునా అన్న చర్చ ఉంది.

ఎందుకంటే తెలంగాణా అంతటా తన క్యాడర్ తో పాటు గ్రౌడ్ లెవెల్ లో బూత్ దాకా బలం ఉన్న పార్టీ సంస్థాగతంగా గట్టిగా ఉన్న పార్టీ కాంగ్రెస్. అందువల్ల కాంగ్రెస్ నీటిలో మొసలి లాంటిదని అంటారు. ఆ పార్టీ పుంజుకుని జూలు విదిలిస్తే మాత్రం అధికారం అందుకోవడమే అని అంటున్న వారూ ఉన్నారు.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ కి అధికారం దక్కేందుకు ఉన్న అవకాశాలు ఎన్ని అన్నదే హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది. సింపుల్ మెజారిటీ దక్కాలీ అంటే అరవై సీట్లు రావాలి. అయితే దాని కంటే తక్కువ వస్తే అపుడు సంగతి ఏంటి అన్నది ఒక కీలక ప్రశ్న. అదే టైం లో బీయారెస్ కి జస్ట్ యాభై సీట్లు వచ్చినా కూడా అధికారం దక్కుతుందా అంటే అవును అనే విశ్లేషకుల అంచనాలు ఉన్నాయి.

అదెలా అంటే బీయారెస్ కి యాభై సీట్లు వస్తే మజ్లీస్ పార్టీకి కచ్చితంగా ఆరేడు సీట్లు వస్తాయి. బీజేపీకి ఎలాంటి పరిస్థితుల్లోనూ నాలుగైదు సీట్లు వస్తాయి. ఇలా చూస్తే ఈ మూడు పార్టీలు కలిస్తే మరోసారి బీయారెస్ ప్రభుత్వం తెలంగాణాలో ఏర్పడుతుంది అని అంటున్నారు.

అంతే కాదు ఒక్కసారి ప్రభుత్వానికి బీయారెస్ రెడీ అయితే కాంగ్రెస్ నుంచి కూడా ఎవరైనా వచ్చినా వస్తారు అని అంటారు. హ్యాట్రిక్ విక్టరీ మీద గట్టి ఆశలు పెట్టుకున్న్న బీయారెస్ ఈ చాన్స్ అసలు వదలకూడదు అనుకుంటోంది. దాంతో బీయారెస్ కి యాభై సీట్ల లోపల వస్తే ఏమో చెప్పలేరు కానీ యాభై వస్తే మాత్రం ప్రభుత్వం ఏర్పాటుకి రెడీ అయిపోతుంది అని అంటున్నారు చూడాలి మరి ఏ మ్యాజిక్ జరుగుతుందో.