అమ్మాయిని రక్తం వచ్చేలా కొట్టిన అధికారి... షాకింగ్ వీడియో!
అవును... ఇటీవల జరిగిన ఓ దాడి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 25 Jan 2025 11:30 PM GMTవిచక్షణ కోల్పోయో, మానవత్వం మరిచిపోయో, ఇంగితం వదిలేసో తెలియదు కానీ ఓ అమ్మాయిపై ఓ భద్రతా అధికారి విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతుంది. ఈ ఘటనపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. అమ్మాయిపై దాడికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అవును... ఇటీవల జరిగిన ఓ దాడి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనికి సంబంధించి తెలుస్తున్న వివరాల ప్రకారం... వార్ధాలోని మహాత్మ గాంధీ ఇంటర్నేషనల్ హిందీ యూనివర్శిటీకి చెందిన సుధీర్ ఖార్కటే అనే భద్రతా అధికారి... రుచికా ఠాకరే అనే అమ్మాయిపై అత్యంత పాశవికంగా దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనకు సంబంధించిన వ్యవహారం అంతా కెమెరాలో బంధించబడింది. ఈ వీడియోలో బైకర్, ఫిట్ నెస్ యాక్టివిస్ట్ అయిన రుచిక తన బైక్ పై నిలబడి ఉండగా.. ఈ సమయంలో కారులో వచ్చిన సుధీర్ ఖార్కటే ఆమెపైకి దూసుకెళ్లాడని.. దీంతో ఆమె కిందపడిపోయిందని అంటున్నారు. ఈ సమయంలో ఆమె తనకు కలిగిన అసౌకర్యంపై ప్రశ్నించే ప్రయత్నం చేసిందని అంటున్నారు.
ఈ సమయంలో.. సుధీర్ తో పాటు అతని భార్యగా చెబుతున్న మహిళ కారులో నుంచి బయటకు వచ్చి ఆమెపై దాడి చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో సంస్కారం మరిచిన, విజ్ఞత విడిచిన వ్యక్తిగా అన్నట్లుగా సదరు సుధీర్ అనే వ్యక్తి బాలిక ముఖ్యంపై కొడుతూ దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది.. నోటి నుంచి రక్తం కారుతూ కనిపించింది.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వడం, వైరల్ అవ్వడం జరిగిపోయింది. దీంతో.. యూనివర్శిటీలో యువత సుధీర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేయడం మొదలుపెట్టారని అంటున్నారు. ఈ సందర్భంగా అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోని ఇప్పటికే మిలియన్ మందిపైగా చూశారు!
ఈ సమయంలో రుచికపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలని.. అతనితో పాటు అతడి పక్కనున్న మహిళపైనా కేసు బుక్ చేయాలని.. ఇంత స్పష్టమైన సాక్ష్యం ఉన్న అనంతరం ఈ విషయాన్ని పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇప్పటికీ అతడిపై చర్యలు తీసుకున్నట్లు తెలియడం లేదు!