భగవంతుడా... చైనాలో బయటపడ్డ మరో ప్రాణాంతక వ్యాధి!
చైనాకి ఉత్తర ప్రాంతంలో ఇన్నర్ మంగోలియా అనే ప్రాంతంలో ఈ వ్యాధి ఇప్పటికే ఇద్దరికి సోకింది.
By: Tupaki Desk | 14 Aug 2023 12:11 PM GMTకరోనా వైరస్... ఈ పేరు వినిపిస్తే ఇప్పటికీ వెన్నులో వణుకు వస్తుంటుంది చాలా మంది వ్యక్తులకు, చాలా దేశాలకూ. ఈ వైరస్ కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయి.. చాలా దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి.. ఎన్నో జీవితాలు చితికిపోయాయి! ఈ సమయంలో చైనాలో మరో వ్యాధి పేరు తెరపైకి వచ్చింది.
అవును... ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ కోవిడ్-19 ప్రపంచాన్ని ఎంత ఇబ్బంది పెట్టిందనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో కొత్తగా మరో ప్రాణాంతకమైన వ్యాధి చైనాలో ప్రబలుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు కేసులు సైతం ఆ దేశంలో నమోదైనట్టు అధికారికంగా ప్రటించారు. దీంతో కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ వ్యాదిపేరు బుబోనిక్ ప్లేగు వ్యాది. అయితే ఇదేమీ కొత్త వ్యాధేమీ కాదు కానీ.. కొత్తగా వ్యాపిస్తోండటమే ఆందోళన కలిగిస్తోంది. చైనాకి ఉత్తర ప్రాంతంలో ఇన్నర్ మంగోలియా అనే ప్రాంతంలో ఈ వ్యాధి ఇప్పటికే ఇద్దరికి సోకింది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారులు ధృవీకరించారు. ఈ వ్యాధి ఆగస్టు 7న మొదలైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
ఇలా ఈ వ్యాధి సోకినవారు తండ్రీ, కూతురు అని తెలుల్స్తోంది. దీంతో వీరిద్దరితోపాటు వీరితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వారందర్నీ పిలిపించి టెస్టులు చేస్తున్నారంట అధికారులు. అయితే ఇప్పటివరకూ మిగిలినవారిలో అసాధారణ లక్షణాలేవీ కనిపించలేదని తెలుస్తోంది. అయినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారంట అధికారులు.
అసలు ఏమిటీ వ్యాధి.. ఎంత ప్రమాధకారి?:
బుబోనిక్ ప్లేగు అనేది.. చాలా వేగంగా వ్యాప్తి చెందే వ్యాధి. ఇది ఎలుకలు, చుంచులు, పందికొక్కులు ద్వారా.. వాటి వ్యర్థాల నుంచి, అవి తినగా వదిలేసిన ఆహారం నుంచి వ్యాపిస్తుంది. దీన్ని "బ్లాక్ డెత్ వ్యాధి" అని కూడా అంటారు. ఇది సోకిన వారికి తగిన సమయంలో ట్రీట్మెంట్ చెయ్యకపోతే.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఆఫ్రికా ఖండంలో చాలా మంది నల్ల జాతీయులు ఈ వ్యాధి బారిన పడి చనిపోతుంటారు కాబట్టి దీన్ని "బ్లాక్ డెత్ వ్యాధి" అని పిలుస్తారు. ఈ కేసులు చైనాలో తక్కువగానే ఉండేవి కానీ... ఈమధ్య కొన్నేళ్లుగా ఇన్నర్ మంగోలియా, వాయవ్య నింజియా ప్రాంతంలో ఇలాంటి కేసులు తరచూ వస్తున్నట్టు తెలుస్తోంది!
బుబోనిక్ ప్లేగు వ్యాధి సోకి వారి శరీరంలోకి ప్లేగ్ బ్యాసిల్లస్, వై.పెస్టిస్ అనే సూక్ష్మజీవులు ఎంటర్ అవుతాయి. ఆ తర్వాత వాటి సంఖ్యను పెంచుకుంటాయి. ఈ బుబోనిక్ ప్లేగు వ్యాధి మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశాలు తక్కువ!