బుద్దా వెంకన్న ఫ్యూచర్ ఇలా అయిపోయిందేంటబ్బా!
పైగా.. అసలు బుద్దా వెంకన్న పార్టీ కార్యాయానికి కూడా రావడం లేదని టాక్. ఇటీవల మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇంచార్జ్‌లకు కీలక కార్యక్రమం నిర్వహించారు.
By: Tupaki Desk | 23 Jan 2025 10:30 PM GMTబుద్దా వెంకన్న. టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు. మాటకు మాట అనే టైపులో వైసీపీని టార్గెట్ చేసిన నేత కూడా. అలాంటి నాయకుడు తాజాగా డమ్మీ అయిపోయారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికలకు ముందు వరకు బుద్దా వెంకన్న హవా విజయవాడలో బాగానే సాగింది. ఆయన మాటకు మీడియా కూడా బాగానే కవరేజీ ఇచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంది. బుద్దా మాట వినేవారు.. వినిపించుకునేవారు కూడా లేకుండా పోయారు. పైగా పార్టీలోనూ ఆయనను పట్టించుకోవడం లేదు.
దీనికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికలకు ముందు.. తనకూ టికె ట్ కావాలంటూ.. బుద్ధా యాగీ చేసిన విషయం తెలిసిందే. రక్త తర్పణం పేరుతో చంద్రబాబుకు రక్తా భిషే కం కూడా చేశారు. అంతేకాదు.. కుల సమీకరణలు తీసుకువచ్చి.. తనకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ, అన్ని సమీకరణల్లోనూ చంద్రబాబుకు.. మైనస్ మార్కులు వచ్చాయి. దీంతో బుద్దాను పక్కన పెట్టారు. అయితే.. ఈ క్రమంలోనే బుద్దా పార్టీ లైన్ దాటారన్నది సీనియర్లు చెబుతున్న మాట.
విజయవాడ పశ్చిమ టికెట్‌ను బీజేపీకి కేటాయించిన తర్వాత.. సుజనా చౌదరికి అనుకూలంగా పనిచేయా లని చంద్రబాబు ఆదేశించే వరకు బుద్దా బయటకు రాలేదు. అంతేకాదు.. ఆయనకు వ్యతిరేకంగా కూడా పనిచేశారన్న వాదనా ఉంది. దీంతో పార్టీ పరంగా ఆయనకు మైలేజీ తగ్గిపోయింది. నిజానికి ఇటీవల జరిగిన నామినేటెడ్ పదవుల విషయంలో .. బుద్దాకు తొలి స్థానం దక్కి ఉండాలి. కానీ, అన్ని కీలక పదవులు అయిపోయాయి. ఇప్పుడు త్వరలోనే చేపట్టే పదవుల విషయంలోనూ ఆయన పేరు వినిపించడం లేదు.
పైగా.. అసలు బుద్దా వెంకన్న పార్టీ కార్యాయానికి కూడా రావడం లేదని టాక్. ఇటీవల మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇంచార్జ్‌లకు కీలక కార్యక్రమం నిర్వహించారు. దీనికి బుద్దా గైర్హాజరయ్యారు. దీని వెనుక ఆయన అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, పార్టీ మాత్రం లైట్ తీసుకుంది. అలాగని.. బుద్దా పార్టీ మారే రకం కాకపోవడం గమనార్హం. తన అసంతృప్తిని తనలోనే ఉంచుకోనున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికైనా న్యాయం జరగకపోతుందా.. అనేది ఆయన అనుచరుల ఎదురు చూపు. మరి ఏం జరుగుతుందో చూడాలి.