Begin typing your search above and press return to search.

ఆరా మస్తాన్ కు బుద్ధా వెంకన్న సవాల్... నాలుక కోసుకోవడమే!

దీంతో అసలు ఫలితాలు వచ్చే లోపు క్లారిటీ రాలేదు సరికదా.. సరికొత్త టెన్షన్ మొదలైందనే కామెంట్లు వినిపించాయి.

By:  Tupaki Desk   |   2 Jun 2024 12:22 PM GMT
ఆరా మస్తాన్  కు బుద్ధా వెంకన్న సవాల్... నాలుక కోసుకోవడమే!
X

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తాజాగా జూన్ 1 - శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఏపీలో ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించిన సర్వే సంస్థలు సుమారుగా సగం వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వెల్లడిస్తే.. సగం కూటమి గెలుపును కన్ ఫాం చేసిన పరిస్థితి.

దీంతో అసలు ఫలితాలు వచ్చే లోపు క్లారిటీ రాలేదు సరికదా.. సరికొత్త టెన్షన్ మొదలైందనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో శనివారం వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో "ఆరా" మస్తాన్ సర్వే ఏపీలో వైసీపీ గెలుపు కన్ ఫాం అనే స్థాయిలో ఫలితాలు వెల్లడించింది. ఇందులో భాగంగా ప్రధానంగా మీడియా ఛానళ్లు ఆరా మస్తాన్ సర్వేకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కనిపించింది.

ప్రధానంగా 2019 ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ సంస్థ ఇచ్చిన ఫలితాలకు అటు జనాల్లో కానీ, ఇటు మీడియా వర్గాల్లోనే కానీ, ఇటు పలువురు రాజకీయ నేతల్లో కానీ కాస్త క్రెడిబిలిటీ ఉన్న మాట వాస్తవం. ఈ సమయంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరా మస్తాన్ కు సవాల్ విసిరారు.

అవును... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "ఆరా" మస్తాన్ ఫేక్ సర్వే చేశారని చెప్పుకొచ్చారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ఇదే క్రమంలో... ఎన్నికల్లో టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వైఎస్ జగన్ ఈ సర్వే విడుదల చేయించారని ఆరోపించారు. అక్కడితో ఆగని వెంకన్న భారీ సవాల్ విసిరారు.

ఇందులో భాగంగా... ఏపీలో ఈసారి కూటమి అధికారంలోకి రాకపోతే తాన్ను నాలుక కోసుకుంటానని బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో... ఆరా ఫలితాలకు వ్యతిరేకంగా కూటమి అధికారంలోకి వస్తే మస్తాన్ నాలుక కోసుకుంటారా అని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తన సవాల్‌ ను స్వీకరించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో... ఎన్నికల్లో ఓడిపోతే అసెంబ్లీలో అడుగుపెట్టనని చెప్పే దమ్ము ధైర్యం జగన్ కు ఉందా అని బుద్ధా వెంకన్న నిలదీశారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసమే ఆరా సర్వే చెప్పించారని.. ఇది ఫేక్ సర్వే అనే విషయం వైసీపీ నేతలకు కూడా తెలుసని బుద్ధా వెంకన్న చెప్పుకొచ్చారు.

ఇలా ఒక సర్వే సంస్థతో ఒక పార్టీ నేత సవాల్ చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆ సర్వే సంస్థ క్రెడిబిలిటీ పెరిగిందా.. లేక... అనే చర్చా మొదలైంది. కాగా... జూన్ 4 - మంగళవారం ఉదయం నుంచి ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే!