మనవడు అంటే లోకేష్ మాత్రమే...క్లారిటీ ఇచ్చినట్లేనా ?
ఎన్టీఆర్ మనవడు అంటే నారా లోకేష్ మాత్రమే అన్నట్లుగానే బుద్ధా చెబుతున్నారు. నిజానికి బుద్ధా ఈ విధంగా ఎందుకు మాట్లాడారు అన్నదే చర్చ.
By: Tupaki Desk | 18 Aug 2024 4:00 AM GMTటీడీపీలో రాజకీయ వారసత్వ పోరుకు ఎండ్ కార్డు పడినట్లే అని 2024 ఎన్నికల ఫలితాల తరువాత చాలా మంది అనుకున్నారు. ఎందుకు అంటే టీడీపీకి డూ ఆర్ డై అన్న పొజిషన్ లో ఈసారి ఎన్నికలు జరిగాయి. అయినా కూడా చంద్రబాబు వ్యూహాలు పొత్తుల ఎత్తులు వైసీపీ తప్పులూ అన్నీ కలసి కూటమికి 164 సీట్లను కట్టబెట్టాయి.
అందులో టీడీపీకి సొంతంగా 135 సీట్లు లభించాయి. ఇది టీడీపీ చరిత్రలోనే బ్రహ్మాండమైన విజయం. అంతే కాదు టీడీపీ మరో పదేళ్ళ పాటు వెనక్కి చూసుకోనవసరం లేని విజయం. ఈ విజయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే 2029లో టీడీపీయే మళ్ళీ గెలుస్తుంది.
అలా కాదు అని ఒకవేళ ఓటమి చెందినా ఆ అయిదేళ్ళూ పోరాడేందుకు అవసరం అయిన శక్తియుక్తులు ఈ అయిదేళ్ళూ ఇస్తాయి. ఎందుకంటే టీడీపీకి లీడర్ గా లోకేష్ ఇప్పటికే రెడీ అయ్యారు. మరో అయిదేళ్ళ తరువాత ఆయన బాగానే కుదురుకుంటారు అని అంటున్నారు.
సో టీడీపీ రాజకీయ వారసత్వం అన్న ప్రశ్న రానే రాదు అని అంటున్నారు. ఇక టీడీపీలో పాత్ర ఏంటి అంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అంటే తండ్రి చంద్రబాబు తరువాత పోస్ట్ ఆయనదే. ఇక ప్రభుత్వంలో చంద్రబాబు సీఎం అయితే లోకేష్ మంత్రి. మరి ఆయన నంబర్ ఏంటి అంటే చెప్పడానికి బయటకు లేకపోయినా టీడీపీ వరకూ ఆయనే నంబర్ టూ. జనసేన మిత్ర పక్షం ఆ పార్టీకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా కూటమిలో లోకేష్ పాత్ర ఆయనదే.
ఇంత క్లియర్ గా పిక్చర్ ఉంటే ఇంకా డౌట్లు ఉన్న వారు ఎవరినా ఉంటారా. పోనీ ఉంటే గింటే కనుక వారికి ఒక క్లారిటీ ఇచ్చేందుకు బుద్ధా వెంకన్న అనే నాయకుడు ఉండనే ఉన్నారు కదా. ఆయన తాజాగా మాట్లాడుతూ టీడీపీలో తాను చంద్రబాబు భువనేశ్వరి, నారా లోకేష్ బ్రాహ్మణి, ఆఖరుకు దేవాన్ష్ నాయకత్వంలో పనిచేస్తాను కానీ వేరు ఎవరి వద్దా కాదని ఖరాఖండీగా చెప్పేశారు.
టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకునే సమస్యే లేదని కుండ బద్ధలు కొట్టారు. టీడీపీకి ఊపు తీసుకుని వచ్చింది. ఆ పార్టీని విజయం దిశగా నడిపించింది నారా లోకేష్ మాత్రమే అని ఆయన అన్నారు. ఇక పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కి ఎందరో మనవళ్ళు ఉన్నారని జూనియర్ ని వారిలో ఒకరిగానే ఇండైరెక్ట్ గా చెప్పారు.
ఎన్టీఆర్ మనవడు అంటే నారా లోకేష్ మాత్రమే అన్నట్లుగానే బుద్ధా చెబుతున్నారు. నిజానికి బుద్ధా ఈ విధంగా ఎందుకు మాట్లాడారు అన్నదే చర్చ. ఇపుడు వారసత్వ పోరు లేదు ఏ సమస్యా లేదు. అయినా ఆయన మాట్లాడారు అంటే టీడీపీలో ఇంకా ఎవరికైనా డౌట్లు ఉన్నా లేక టీడీపీని ఎపుడైనా జూనియర్ తన పార్టీ అంటారని ఆలోచించేవారికైనా కళ్ళు తెరిపించేందుకే అని అంటున్నారు.
అంత వరకూ అవసరం లేదు. ఎన్ టీయార్ టీడీపీని స్థాపించినా దానికి గత మూడు దశాబ్దాలుగా భుజాన వేసుకున్నది చంద్రబాబు, ఆయన కుమారుడుగా లోకేష్ కే వారసత్వం హక్కు ఉంటుంది. పైగా లోకేష్ కూడా టీడీపీ కోసం కష్టపడుతున్నారు. దాంతో లోకేష్ వారసుడు అవుతారు అని కళ్ళు మూసుకుని ఎవరైనా చెప్పవచ్చు. ఒకవేళ ఈసారి టీడీపీ ఓడితే జూనియర్ ప్రస్తావన రావచ్చేమో కానీ గెలిచి నిలిచింది కాబట్టి నో మోర్ డిస్కషన్స్ అన్నట్లుగానే సీన్ చాలా క్లియర్ గా ఉంది. ఇంతకీ బుద్ధా వెంకన్న లోకేష్ కి జై అంటున్నారు.ఆయనకు ఏమైనా పదవిని చినబాబు కరుణిస్తారా అన్నదే అసలైన ప్రశ్న.