Begin typing your search above and press return to search.

బౌద్ధ భిక్షువు కృషితో మురికివాడ నుంచి ఎంబిబిఎస్..

పింకీ హర్యాన్ చెత్త కుప్పల వద్ద ఆహారం కోసం వెతికేది. ఏది దొరకని సమయంలో వీధులలో భిక్షాటన కూడా చేసేది.

By:  Tupaki Desk   |   4 Oct 2024 3:30 PM GMT
బౌద్ధ భిక్షువు కృషితో మురికివాడ నుంచి ఎంబిబిఎస్..
X

మన చుట్టూ ఉన్న సమాజంలో వింతలు ఎన్నో జరుగుతూ ఉంటాయి.. ఓడలు బండ్లవ్వడం…బండ్లు ఓడలవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే బిచ్చమెత్తె స్థితి నుంచి ఓ అమ్మాయి ఇప్పుడు పదిమందికి ప్రాణదానం చేసే స్థితికి ఎదిగింది. ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్న అవి మనకు తరతరాల ఇన్స్పిరేషన్ గా మిగిలిపోతాయి. డాక్టర్ చదవడం అంటే సామాన్యమైన విషయం కాదు.. అలాంటిది ఎటువంటి ఆర్థిక సహాయం లేని స్థితి నుంచి డాక్టర్ గా ఎదిగిన పింకీ హర్యాన్ జీవితం ఎందరికో ఆదర్శం.

చిన్నతనంలో తన తల్లిదండ్రులతో కలిసి మెక్లీడ్‌గంజ్‌లోని

పింకీ హర్యాన్ చెత్త కుప్పల వద్ద ఆహారం కోసం వెతికేది. ఏది దొరకని సమయంలో వీధులలో భిక్షాటన కూడా చేసేది. కట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత చైనీస్ వైద్య పట్టా సాధించింది. అప్పుడప్పుడు మనుషుల జీవితాల్లో మ్యాజిక్ జరుగుతుంది.. పింకీ జీవితంలో కూడా అలాంటి మ్యాజిక్ 2004లో సంభవించింది.

టిబెటన్ శరణార్థి సన్యాసి ధర్మశాలకు చెందిన చారిటబుల్ ట్రస్ట్ కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న లోబ్సాంగ్ జమ్యాంగ్ 2004లో భిక్షాటన చేసుకుంటున్న పింకీ హర్యాన్ ను గమనించారు. అనంతరం ఒకసారి ఆయన

చరణ్ ఖుద్ వద్ద మురికివాడిని సందర్శించినప్పుడు అక్కడ ఈ పాపని చూశారు. తర్వాత ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి ఆమెకు విద్య నేర్పించడం ప్రారంభించారు. అయితే ఇందుకు మొదట్లో ఆమె తండ్రి కాశ్మీరీ లాల్ అస్సలు సమ్మతించలేదు.. అయితే లోబ్సాంగ్ జమ్యాంగ్ ఆయన్ను ఎన్నో గంటలు మాట్లాడి ఒప్పించారు.

ధర్మశాల లో ఉన్న దయానంద్ పబ్లిక్ స్కూల్లో పింకీ హర్యాన్ కు అడ్మిషన్ ఇప్పించడంతోపాటు.. చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిరుపేద పిల్లల కోసం ఏర్పాటు చేసిన హాస్టల్లో మొదటి బ్యాచ్ విద్యార్థులలో ఆమెకు స్థానం కల్పించారు. పింకీ హర్యాన్ తనకు వచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ బాగా చదువుకుంది. 2018లో చైనాలోనే ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందడంతో పాటు ఎంబిబిఎస్ కోర్సును కూడా పూర్తిచేసింది.

మురికివాడలో పెరిగే నిరుపేద పిల్లలు కనీస ప్రాథమిక విద్యను అందుకొని గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలి అనే ముఖ్య ఉద్దేశంతో జమ్యాంగ్ ఓ ట్రస్టును ప్రారంభించారు. అతని కృషితో వీధులలో, మురికివాడలో తిరగాల్సిన పిల్లలు ఇప్పుడు సమాజంలో మంచి స్థితిలో ఉంటున్నారు. మన సమాజానికి జమ్యాంగ్ లాంటి వ్యక్తుల అవసరం ఎంతో ఉంది.