Begin typing your search above and press return to search.

రాహుల్ తో బుడ్డోడు... మధ్యలో మ్యారేజ్ మేటర్!

ఆ సంగతి అలా ఉంటే... బీహార్‌ లోని కిషన్‌ గంజ్‌ కు చెందిన 6 ఏళ్ల యూట్యూబర్.. రాహుల్ పెళ్లి గురించి ప్రశ్నించడం ఇప్పుడు వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 9:55 AM GMT
రాహుల్  తో బుడ్డోడు... మధ్యలో మ్యారేజ్  మేటర్!
X

కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ప్రస్తుతం భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మార్గమధ్యలో పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ వాహనంపై పలువురు రాళ్లు రువ్వారు. ఆ సంగతి అలా ఉంటే... బీహార్‌ లోని కిషన్‌ గంజ్‌ కు చెందిన 6 ఏళ్ల యూట్యూబర్.. రాహుల్ పెళ్లి గురించి ప్రశ్నించడం ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్‌ లోని కిషన్‌ గంజ్‌ లో కొనసాగుతున్న సమయంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఇందులో భాగంగా... ఈ పర్యటనలో రాహుల్ గాంధీని కలుసుకున్న ఆరేళ్ల బుడ్డోడు... "ఆప్ షాదీ కబ్ కరోగే (నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావు?)" అని అడిగాడు. దీంతో ఈ ప్రశ్నకు స్పందించిన రాహుల్ గాంధీ సరదా సమాధానం ఇచ్చారు.

ఇలా మాంచి సీరియస్ మూడ్ లో "భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర"లో ఉన్న రాహుల్‌ ను ఆ కుర్రాడు ఈ ప్రశ్న అడగగానే ఆయన కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆ ప్రశ్నకు సమాధానంగా స్పందించిన రాహుల్... "ఇప్పుడు నేను పనిలో బిజీగా ఉన్నాను. ఖాళీ సమయం దొరికిన తర్వాత నేను పరిశీలిస్తాను" అని చెప్పారు. ఆ సమాధానం అనంతరం వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా బీహార్ వచ్చిన రాహుల్‌ ను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ యాత్ర మణిపూర్‌ లో ప్రారంభమై పశ్చిమ బెంగాల్ మీదుగా బీహార్‌ కు చేరుకుంది.