Begin typing your search above and press return to search.

''ఆ ఎంపీ.. సుజ‌నా చౌద‌రి క్యారేజీలు మోశాడు''

సుజ‌నా చౌద‌రిని గురించి కేశినేని భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నార‌ని బుద్దా అన్నారు. అందుకే లేనిపోని వ్యాఖ్య‌లు చేశార‌ని తెలిపారు.

By:  Tupaki Desk   |   29 April 2024 2:30 AM GMT
ఆ ఎంపీ.. సుజ‌నా చౌద‌రి క్యారేజీలు మోశాడు
X

విజ‌య‌వాడ రాజ‌కీయాలు మ‌రింత హీటెక్కాయి. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుత బీజేపీ అభ్య‌ర్థి సుజ‌నా చౌద‌రిపై.. విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థి, వైసీపీ నాయ‌కుడు కేశినేని నాని చేసిన వ్యాఖ్య‌ల‌కు టీడీపీ అంతే తీవ్రంగా కౌంట‌ర్ ఇచ్చింది. కేశినేని నాని.. గ‌తంలో సుజనా చౌద‌రి క్యారేజీలు మోశారంటూ.. టీడీపీ నేత ఫైర్‌బ్రాండ్ బుద్దా వెంక‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సుజ‌నా చౌద‌రిని విమ‌ర్శించే స్థాయి కేశినేనికి లేద‌న్నారు. అదేవిధంగా చంద్ర‌బాబు కాలిగోటికి కూడా కేశినేని స‌రిపోడ‌ని వ్యాఖ్యానించారు.

సుజ‌నా చౌద‌రిని గురించి కేశినేని భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నార‌ని బుద్దా అన్నారు. అందుకే లేనిపోని వ్యాఖ్య‌లు చేశార‌ని తెలిపారు. సుజ‌నా అభివృద్ది చేస్తాన‌ని చెబుతుంటే.. నాని ఫ్యాంటు త‌డిచిపోతోంద‌ని, అందుకే.. ఆయ‌న‌పై లేనిపోని అవాకులు చ‌వాకులు పేలుతున్నార‌ని చెప్పారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాన్ని సుజ‌నా సింగ‌పూర్ చేస్తాన‌ని చెప్ప‌లేద‌న్నారు. ఒక‌వేళ సింగ‌పూర్ న‌గ‌రంగా తీర్చిదిద్దినా.. ఇక్క‌డి పేద‌ల‌ను మాత్రం త‌రిమేయ‌ర‌ని.. ఈ విష‌యంలో కేశినేని చేసిన విమ‌ర్శ‌ల‌ను ప్ర‌జ‌లు అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు.

కేశినేని ద‌గుల్బాజీ రాజకీయం చేస్తున్నార‌ని బుద్ధా మండి ప‌డ్డారు. వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా మారుస్తాన‌ని చెబితే.. ఆయ‌న‌కు క‌డుపునొప్పి వ‌స్తోంద‌ని.. పేద‌లు ఇంకా పేద‌లుగా ఉండి..వీరి మోచేతి నీళ్లు తాగాల‌ని చూస్తున్నార‌ని.. ఎద్దేవా చేశారు. ఒక‌ప్పుడు సుజ‌నా ఇంటి గేటు ముందు కుక్క‌లాగా కాప‌లా కాసి, ఆయ‌న‌కు క్యారేజీలు మోసిన వాళ్లు కూడా .. ఆయ‌న‌ను విమ‌ర్శిస్తున్నార‌ని.. నిప్పులు చెరిగారు. కేశినేనికి ప్యాకేజీ ఇస్తే.. ఏమైనా చేస్తాడ‌ని.. బూట్లు కూడా నాకుతాడ‌ని వ్యాఖ్యానించారు. సుజ‌నా వంటి వ్య‌క్తుల గురించి మాట్లాడేట‌ప్పుడు నోరు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాల‌ని బుద్దా కౌంట‌ర్ ఇచ్చారు.