Begin typing your search above and press return to search.

పెండింగ్‌ లో బుగ్గన నామినేషన్‌... అసలేం జరిగిందంటే...?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 April 2024 10:53 AM GMT
పెండింగ్‌  లో బుగ్గన నామినేషన్‌... అసలేం జరిగిందంటే...?
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నెల 29 వరకూ నామినేషన్ల విత్ డ్రా లకు ఛాన్స్ ఉంది! ఆ సంగతి అలా ఉంటే... ఈ సమయంలో కొన్ని నామినేషన్ల విషయంలో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కొడాలి నాని నామినేషన్ పై టీడీపీ ఫిర్యాదు చేయగా.. తాజాగా బుగ్గన రాజేంద్రనాథ్ నామినేషన్ పెండింగ్ లో పెట్టిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి అయ్యింది.. ఇక ప్రచారానికి దిగడమే అని భావిస్తున్న నేపథ్యంలో.. తాజాగా మాజీ మంత్రి, కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌ పై వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో... టర్నింగ్‌ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి నామినేషన్ పెండింగ్ లో పెట్టారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది!

వివరాళ్లోకి వెళ్తే... ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మరోసారి డోన్‌ నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు నామినేషన్ల పరిశీలన సందర్భంగా.. ఆయన ఎన్నికల అఫిడవిట్‌ పై అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఇందులో భాగంగా... టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి తరఫు న్యాయవాది.. బుగ్గన నామినేషన్ పై అభ్యంతరం తెలిపారు.

ఇందులో భాగంగా... బుగ్గన తన ఆస్తుల వివరాలు పూర్తిగా వెల్లడించలేదని, నామినేషన్‌ పత్రంలో కొన్ని కాలమ్స్‌ ని భర్తీ చేయలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే క్రమంలో.. ఈ ఫిర్యాదులో పేర్కొన్న విషయాలకు సంబంధించి తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అందువల్ల వెంటనే అతని నామినేషన్‌ తిరస్కరించాలని ఎన్నికల అధికారిని కోరారు. ఇదే సమయంలో కొన్ని ఆధారలను ఆర్వోకు చూపించారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో స్పందించిన రిటర్నింగ్‌ అధికారి.. ప్రస్తుతం ఆయన నామినేషన్‌ ను పెండింగ్‌ లో ఉంచారని తెలుస్తుంది. ఈ మేరకు... సాయంత్రంలోగా ఆస్తుల వివరాలు ఇవ్వాలని బుగ్గన తరఫు న్యాయవాదికి నోటీసు ఇచ్చారని సమాచారం! దీంతో... బుగ్గన నామినేషన్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది!