Begin typing your search above and press return to search.

అపర కోటీశ్వరుడు చెప్పే లగ్జరీలు తెలిస్తే ఆశ్చర్యపోతారంతే?

హర్ష గోయెంకా పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో ఒకరు. భారతీయులు విశ్వసించే కంపెనీల్లో ఆయన ఛైర్మన్ గా వ్యవహరించే ఆర్ పీజీ గ్రూపు ఒకటి.

By:  Tupaki Desk   |   31 Jan 2025 5:06 AM GMT
అపర కోటీశ్వరుడు చెప్పే లగ్జరీలు తెలిస్తే ఆశ్చర్యపోతారంతే?
X

హర్ష గోయెంకా పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో ఒకరు. భారతీయులు విశ్వసించే కంపెనీల్లో ఆయన ఛైర్మన్ గా వ్యవహరించే ఆర్ పీజీ గ్రూపు ఒకటి. దశాబ్దాల తరబడి భారతీయుల జీవనంలో కలిసి నడిచే ఈ గ్రూప్ నిజజీవితంలో ఏదో రూపంలో వినియోగించే పరిస్థితి. 67 ఏళ్ల వయసులోనూ సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరించే ఆయన.. తన రాతలతో అందరి మనసుల్ని దోచుకుంటూ ఉంటారు. 4.7 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా టర్నోవర్ కలిగి ఉన్న ఈ గ్రూపు పరిధిలో కేఈసీ ఇంటర్నేషనల్.. సియట్.. జెన్ సర్ టెక్నాలజీస్.. ఆర్ పీజీ లైఫ్ సైన్సెస్ తో పాటు మరిన్ని వ్యాపారాలు ఉన్నా యి.

దేశంలోని అత్యంత సంపన్నుల టాప్ 100 జాబితాలో హర్ష్ గోయంకా 76వ స్థానంలో నిలుస్తారు. ప్రసిద్ధ పారిశ్రామికవేత్త ఆర్పీ గోయెంకా పెద్ద కుమారుడే ఈ హర్ష్ గోయెంకా. కోల్ కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రులు అయ్యారు. ఆ తర్వాత ఐఎండీతో పాటు విదేశీ విద్యాభ్యాసం చేసిన ఆయన.. తన తండ్రి వ్యాపార పగ్గాల్ని చేపట్టారు. ఇలా తీరిక లేని వ్యాపారంలో మునిగి ఉన్న ఆయన.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంటారు.

స్ఫూర్తినిచ్చే సందేశాల్ని.. పోస్టుల్ని ఆయన పెడుతుంటారు. ఆయన్ను ఫాలో అయ్యే వారంతా ఆయన్ను విపరీతంగా అభిమానిస్తారు. దీనికి తగ్గట్లే, ఆయన పని తీరు ఉంటుందని చెప్పాలి. తాజాగా ఆయన పెట్టిన పోస్టు ఆసక్తికరంగానే కాదు.. ఆయన్ను మరింత పాపులర్ గా మారారు. తాజాగా ఆయన పెట్టిన పోస్టు అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది. జీవితంలో అసలైన విలాసాలు ఇవీ అంటూ ఆయన చెప్పిన జాబితాను చూసినప్పుడు.. సాదాసీదా జీవితాన్ని లీడ్ చేసే వారికి కూడా అనువుగా ఉండేలా ఆయన మాటలు ఉండటం గమనార్హం.

లగ్జరీ జీవితం అంటే.. ‘అద్దాల మేడలో ఉండటం.. ఖరీదైన కార్లలో తిరగటమే లగ్జరీ లైఫ్ కాదు. అవేమీ లేకున్నా విలాసవంతంగా జీవించొచ్చు. కంటి నిండా నిద్ర.. ప్రశాంతమైన జీవనం జీవితంలో అసలైన విలాసాలు. గడిచిపోయిన కాలాన్ని ఎప్పటికీ తిరిగి పొందలేం. అందుకే కాలమే అన్నింటికన్నా విలువైనది.. విలాసవంతమైనది’ అంటూ ఆయన పెట్టిన పోస్టు అందరిని ఆకర్షిస్తోంది.

మనిషికి అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్యమని.. సంపూర్ణ ఆరోగ్యమే మహా భాగ్యమన్న ఆయన.. ‘‘ఎంత సంపాదించినా జీవితంలో ప్రశాంతత లేనిదే అవన్నీ వ్యర్థం. అందుకే ప్రశాంత జీవనమూ విలాసమే. సమయాన్ని దుర్వినియోగం చేశానన్న నామోషీ చెందకుండా విశ్రాంతి తీసుకోవాలి. రెస్టును విరామంగా కాకుండా రీఛార్చిగా భావించాలి. హడావుడి లేకుండా ఉదయాన్ని ప్రారంభమించడమూ లగ్జరీనే’’ అంటూ ఆయన చెప్పే మాటలు చదివినంతనే.. నిజమే కదా? అన్న భావనకు గురి కావటం ఖాయం.

విలాసవంతమైన జీవితం గురించి చెబుతూ.. రాత్రి నిద్రకు ముందు రేపటి గురించి భయం లేకుండా హాయిగా నిద్రకు ఉపక్రమించటం కూడా విలాసవంతంగా జీవిస్తున్నట్లేనని వ్యాఖ్యానించటం గమనార్హం. లైఫ్ స్కిల్స్ లో భాగంగా ఆయన ఒక సూచన చేస్తారు. అదేమంటే.. ‘ఇతరులతో నడిపే చర్చలు అర్థవంతంగా ఉండాలి.. లోతైన అవగాహన పెంచుకునేందుకు అవసరమైన మాటలు కూడా విలాసమే’ అని పేర్కొన్నారు. ఎంత సంపాదించినా.. ఏ పని చేస్తున్నా.. ఇంటి భోజనం తినడంలో ఉండే సంత్రప్తి మరి దేనిలో ఉండదన్నారు. ప్రేమను ఇతరులకు పంచటం వారి నుంచి తిరిగి పొందడమూ విలాసమని చెప్పే ఆయన మాటలు ఈ తరం వారిని సైతం విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి విలువైన లైఫ్ స్కిల్స్ ను మరింత ప్రభావవంతంగా చెబుతూ.. సరికొత్త స్ఫూర్తివంతంగా అందరి మదిలో రిజిస్టర్ కావాలని ఆశిద్దాం.