Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ బుచ్చయ్య అంటున్నారుట...!?

ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి పొలిటికల్ హిస్టరీ చూస్తే 1983లో తొలిసారి టీడీపీ తరఫున రాజమండ్రిలో గెలిచారు.

By:  Tupaki Desk   |   27 May 2024 8:31 AM GMT
హ్యాట్రిక్ బుచ్చయ్య అంటున్నారుట...!?
X

రాజమండ్రికి చెందిన టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి. ఆయనది తెలుగుదేశంతో పేగు సంబంధం. అంటే ఆ పార్టీ పుట్టుక నుంచి ఆయన ఉన్నారు. టీడీపీ పునాదుల నుంచి ఉన్న సీనియర్ నేతలలో ఆయన ఒకరు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ మెచ్చిన నేత. ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్ లో కొన్నాళ్ళు మంత్రిగా కూడా పనిచేశారు.

ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి పొలిటికల్ హిస్టరీ చూస్తే 1983లో తొలిసారి టీడీపీ తరఫున రాజమండ్రిలో గెలిచారు. అలాగే 1985లో రెండోసారి జయభేరీ మోగించారు. 1989లో తొలిసారి ఓటమి పాలు అయినా 1994, 1999లలో రెండు సార్లు గెలిచి సత్తా చాటారు. ఇక 2004, 2009లలో ఓడారు.

అయితే 2014, 2019లలో రాజమండ్రి రూరల్ నుంచి గెలిచి సత్తా చాటారు. 2024లో కనుక బుచ్చయ్య చౌదరి గెలిస్తే హ్యాట్రిక్ కొడతారు. నిజానికి చూస్తే సీనియర్ మోస్ట్ లీడర్ అయిన బుచ్చయ్యకు హ్యాట్రిక్ విక్టరీ కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది.

ఆయన వరసగా రెండు సార్లు గెలిచినా మూడోసారి ఓటమి పాలు కావడం వల్ల ఆయన పొలిటికల్ హిస్టరీలో హ్యాట్రిక్ సక్సెస్ అన్న పదం లేకుండా పోయిందట. ఈసారి చాలా పట్టుదల మీద ఆయన పోటీకి దిగారు. రాజమండ్రి రూరల్ టికెట్ ని సాధించుకున్నారు. ఆయన తన పొలిటికల్ కెరీర్ లో పదవసారి పోటీ చేస్తున్నారు.

ఈసారి గెలుపుతో హ్యాట్రిక్ విక్టరీని సాధించడమే కాదు, తన పొలిటికల్ కెరీన్ ని పూర్తి సంతృప్తిగా కొనసాగించాను అన్న హ్యాపీని ఈసారి ఫలితాలు ఇవ్వబోతున్నాయని బుచ్చయ్య చూవ్దరి ధీమాగా ఉన్నారు

ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ ఏకంగా మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణను రంగంలోకి దించింది. బీసీ కార్డుతో వ్యూహాత్మకంగానే పావులు కదిపింది. అయితే నాన్ లోకల్ అన్న టీడీపీ ప్రచారం తో పాటు కేవలం రెండు నెలలకు ముందే ఎన్నికల గోదాలోకి దిగడం మంత్రికి మైనస్ అవుతాయని అంటున్నారు.

బుచ్చయ్య హ్యాట్రిక్ విజయం అలా నమోదు అవుతోందని కూడా టీడీపీ శిబిరం పూర్తి నమ్మకంగా ఉంది. అయితే మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణ వర్గం మాత్రం తాము గెలిస్తామని చెబుతోంది. బీసీలు ఈసారి తమ వైపు నిలబడ్డారని, సంక్షేమమే గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు. అలాగే మహిళా ఓటింగ్ తమకే అనుకూలం అని చెబుతున్నారు. పెరిగిన ఓటింగ్ కూడా వైసీపీయే ఫేవర్ అని వారు విశ్లేషించుకుంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే తన కెరీర్ లో ఈసారి గెలుపు అవసరం అని అటు మంత్రి చెల్లుబోయిన ఇటు బుచ్చయ్య చౌదరి ఇద్దరూ భావిస్తున్నారు భారీగా సాగిన రాజమండ్రి రూరల్ పోలింగ్ లో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తాయన్నది కొద్ది రోజులు ఆగితే తేలిపోతుంది.