Begin typing your search above and press return to search.

కాలిఫోర్నియా ఒడ్డున కలకలం రేపుతున్న డూమ్స్‌డే చేప..

సాధారణంగా మన చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలకు జరగబోయే భవిష్యత్తుకు కొందరు ముడిపెడుతూ ఉంటారు.

By:  Tupaki Desk   |   28 Aug 2024 11:30 AM GMT
కాలిఫోర్నియా ఒడ్డున కలకలం రేపుతున్న డూమ్స్‌డే చేప..
X

సాధారణంగా మన చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలకు జరగబోయే భవిష్యత్తుకు కొందరు ముడిపెడుతూ ఉంటారు. ఇందులో కొన్ని నిజాలు ఉంటాయి.. కొన్ని కల్పనలు ఉంటాయి. అయితే వీటిలో వేటిని నమ్మాలో.. వేటిని నమ్మకూడదు కొన్ని సందర్భాలలో మనకు అర్థం కాదు. కొందరు వీటిని నమ్మితే మరి కొందరు మూఢనమ్మకాలు అని కొట్టి పడేస్తారు.. ఏదేమైనాప్పటికీ సృష్టిలో జరిగే ప్రతి చర్యకి ఓ ప్రతిచర్య దాగి ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇంతకీ విషయం ఏమిటంటే సముద్రంలో దొరికే లక్షలాది చేప జాతులలో గాడ్స్ ఫిష్ అని పిలిచే ఓ చేప ఉంది. ఈ చేప చాలా అరుదుగా కనిపించడం.. ఒకవేళ పొరపాటున ఇది కనిపిస్తే ఏదో ఒక విపత్తు జరగడం అలా సందర్భాలలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చేపకు జరగబోయే విపత్తులకు కనెక్షన్ ఉన్నట్టు ఆ ప్రాంతం ప్రజలు భావించడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ చేప మృతదేహం ఒడ్డున కనిపించడం తో తిరిగి అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

డూమ్స్‌డే అనే ఈ చేప ఓర్ ఫిష్ రెగలేసిడే అనే చేప కుటుంబానికి చెందిన చేప.ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయగల సామర్థ్యం ఓర్‌ఫిష్‌కు ఉందనే నమ్మకం ఉంది. 12 అడుగుల నుంచి సుమారు 30 అడుగుల వరకు పొడుగు ఉండే ఈ చేపలు పెద్ద కళ్ళు కలిగి ఉంటాయి. సాధారణంగా సునామీలు, భూకంపాలు, వరదలు లాంటివి సంభవించే ముందు ఈ చేపలు కనిపిస్తాయని ప్రజల నమ్మకం.

అందుకే ఈ చేపలు కనిపించడం వినాశానికి సంకేతం అని అందరూ భావిస్తారు. 2011లో జపాన్ భూకంపానికి ముందు 20 వరకు ఓర్‌ఫిష్‌లు ఒడ్డున తేలుతూ కనిపించాయి. చేపలకు విపత్తులకు సంబంధమేమిటి అని మీరు అనుకోవచ్చు.. కానీ జపనీస్ జానపద కథలలో కూడా వీటి గురించి ప్రస్తావించారు. వీటిని విపత్తుల హర్బింగర్స్ గా జపాన్ జానపదాల్లో వర్ణించారు. అంతేకాదు ఈ చేపలు కనిపించిన ప్రతిసారి ఆ సమీప ప్రాంతాలలో ఏదో ఒక విపత్తు సంభవించింది. కాబట్టి ఇప్పుడు కాలిఫోర్నియా సముద్రపు బొట్టున ఈ చేపను చూసిన స్థానికులు ఆందోళన చెందుతున్నారు.