Begin typing your search above and press return to search.

ఆమె.. నన్ను శృంగార బానిసగా చేసుకుంది!

అగ్రరాజ్యం అమెరికాలో ప్రజాప్రతినిధులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కొత్త కాదు.

By:  Tupaki Desk   |   10 Sep 2024 6:33 AM GMT
ఆమె.. నన్ను శృంగార బానిసగా చేసుకుంది!
X

అగ్రరాజ్యం అమెరికాలో ప్రజాప్రతినిధులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కొత్త కాదు. గతంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్, ప్రస్తుతం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ తదితరులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అలాగే మరెంతో మందిపై ఈ తరహా అభియోగాలు నమోదయ్యాయి.

ఈ క్రమంలో కాలిఫోర్నియా రాష్ట్ర మహిళా సెనేటర్‌ అయిన మేరీ అల్వరాడో గిల్‌ వివాదంలో కూరుకుపోయారు. ఆమె తన వద్ద పనిచేసే పురుష సిబ్బందిలో ఒకరిని లైంగికంగా వేధించేదని వెల్లడైంది. ఈ మేరకు మేరీ అల్వరాడో వద్ద పనిచేసిన పురుష సిబ్బందిలో ఒకరు ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె వద్ద తాను విధులు నిర్వహించినప్పుడు ఆమె తనను శృంగార బానిసగా వాడుకుందని మాజీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. దీంతో తాను ఎంతో మానసిక వేదనకు గురయ్యానని తెలిపారు.

మేరీ అల్వరాడో గిల్‌ అమెరికాలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన కాలిఫోర్నియా సెనేటర్‌ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బాధిత వ్యక్తిని ఆమె తన చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ గా నియమించుకుంది. ఇక అప్పటి నుంచి మేరీ అల్వరాడో గిల్‌ అతడిని లైంగికంగా వేధించేది. అతడితో తన వ్యక్తిగత విషయాలను పంచుకునేది. ముఖ్యంగా లైంగిక జీవితానికి సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడేది. అంతేకాకుండా అతడిని సెనేటర్‌ మేరీ అల్వరాడో గిల్‌ లైంగికంగా వేధించారు. ఈ క్రమంలో తరచూ అతడిని అసహజ శృంగారం చేయాలని కోరుకునేవారు. అతడు ఒప్పుకోకుంటే బెదిరించేవారు. తద్వారా బలవంతంగా సెనేటర్‌ మేరీ అల్వరాడో గిల్‌ తన శృంగార కోరికలు తీర్చుకునేవారు. ఈ మేరకు బాధితుడు ఈ వివరాలన్నింటిని తన పిటిషన్‌ లో పేర్కొన్నాడు.

మహిళా సెనేటర్‌ మేరీ అల్వరాడో వేధింపులతో బాధితుడు తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురయ్యాడు. అంతేకాకుండా వినికిడి శక్తిని కోల్పోయాడు. వెన్నునొప్పి బారినపడ్డాడు.

ఇక అప్పటి నుంచి సెనేటర్‌ మేరీ అల్వరాడో శృంగార కోరికలకు అతడు ఎదురుచెప్పడం ప్రారంభించాడు. దీంతో అతడి ప్రవర్తన బాగోలేదని అతడిని ఉద్యోగం నుంచి తొలగించడానికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో బాధితుడిని గతేడాది డిసెంబరులో విధుల నుంచి తొలగించారు. అతడికి రావాల్సిన వేతన బకాయిలను కూడా ఇవ్వకుండా మరింత వేధించారు. ఈ నేపథ్యంలో తనకు జరిగిన నష్టానికి గానూ పరిహారం ఇప్పించాలని కోరుతూ శాక్రామెంటో కౌంటీ సుపీరియర్‌ కోర్టులో బాధితుడు పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే బాధితుడి ఆరోపణలను మహిళా సెనేటర్‌ మేరీ అల్వరాడో తోసిపుచ్చారు. అతడు డబ్బు కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. తాను ఎవరినీ లైంగికంగా వేధించాలని స్పష్టం చేశారు. అతడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా మేరీ అల్వరాడో గిల్‌.. కొన్ని నెలల కిందట లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా యూఎస్‌ కాంగ్రెస్‌ లో బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. మేరీకి వివాహమై ఆరుగురు సంతానం ఉన్నారు. బాధితుడికి కూడా వివాహమైనట్లు తెలుస్తోంది. ్రప్రస్తుతం బాధితుడి పిటిషన్‌ ను కోర్టు విచారిస్తోంది.