Begin typing your search above and press return to search.

4855 ఏళ్ల నాటి చెట్టు.. అది ఎక్కడుంది? ఏంటా కథ

ప్రపంచంలోనే పురాతన చెట్టు అమెరికాలో ఉన్నది. కాలిఫోర్నియాలో ఉన్న మెతుసెలా అనే చెట్టు వయసు సుమారు 4855 సంత్సరాలుగా నిర్ణయించారు.

By:  Tupaki Desk   |   26 April 2024 3:57 AM GMT
4855 ఏళ్ల నాటి చెట్టు.. అది ఎక్కడుంది? ఏంటా కథ
X

చెట్లు మానవాళి మనుగడకు ఉపయోగపడతాయి. చెట్లు లేకపోతే పర్యావరణం దెబ్బ తింటుంది. వాతావరణం కలుషితం అవుతుంది. వైపరీత్యాలు ఏర్పడతాయి. పూర్వ కాలం నుంచి మానవ నాగరికతలో చెట్లు ఒక భాగంగా నిలుస్తున్నాయి. చెట్లతోనే మానవ మనుగడ దాగి ఉంది. ఈనేపథ్యంలో చెట్ల ప్రాధాన్యతను గుర్తించి వాటికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.

ప్రపంచంలోనే పురాతన చెట్టు అమెరికాలో ఉన్నది. కాలిఫోర్నియాలో ఉన్న మెతుసెలా అనే చెట్టు వయసు సుమారు 4855 సంత్సరాలుగా నిర్ణయించారు. సముద్ర మట్టానికి దాదాపు 9500 అడుగుల ఎత్తులో బ్రిస్టిల్ కోన్ పైన్ అడవిలో ఇది ఉంది. అడవిలో ఈ చెట్టు కచ్చితమైన స్థానాన్ని అమెరికా ఫారెస్ట్ అధికారులు ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు.

1957లో ఎడ్మండ్, టామ్ హర్లాన్ అనే శాస్త్రవేత్తలు ఈ చెట్లు శాంపిల్ ను పరీక్షించి వయసును అంచనా వేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన చెట్టుగా చెబుతున్నారు. ఈ చెట్టు గురించి చాలా పరిశోధనలు జరిగాయి. దాని పుట్టు పూర్వోత్తరాలు, ఎదిగే క్రమంపై శాస్త్రవేత్తలు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. చెట్టు ప్రాధాన్యం అన్ని స్థాయిల్లో విశ్లేషిస్తున్నారు.

ఇన్ని సంవత్సరాలుగా చెట్టు చెక్కుచెదరకుండానే ఉంది. కొన్ని కొంత కాలం వరకే ఉంటాయి. తరువాత దానికి ఏదో సమస్య తలెత్తి మెల్లగా నాశనం అవుతుంది. కానీ ఈ చెట్టు మాత్రం వేల ఏళ్లుగా అలాగే ఉంది. ఏ రోగం లేకుండా అలాగే ఉందంటే దాని నిరోధక శక్తి ఏపాటిదో అర్థమవుతోంది. ఈ చెట్టు వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు దక్కుతాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆ చెట్టు ఏపుగా ఎదిగి ఆకాశమంత ఎత్తుకు దూసుకుపోయింది. దాని కింద నిలబడి తల పైకెత్తి చూస్తేనే కనిపిస్తుంది. అలాంటి చెట్టు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుంటుంటే ఆశ్చర్యం కలగక మానదు. మెతుసెలా చెట్టు ఇన్ని కాలాలు బతుకుతుందని అనుకుంటున్నారు. ఇలాంటి చెట్ల వల్ల మనకు ఒనగూరే ప్రయోజనాలు కలుగుతాయని తెలుస్తోంది.