విడాకులు తీసుకున్న ఆ దేశ ప్రధాని
తాజాగా ఆ జాబితా లోకి చేరారు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.
By: Tupaki Desk | 3 Aug 2023 4:02 AM GMTసినీ నటులు.. క్రీడాకారులు.. సెలబ్రిటీల తో పోలిస్తే రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలు.. వైవాహిక జీవితాల కు సంబంధించిన వార్తలు పెద్దగా రావనే చెప్పాలి. ఏ మాత్రం చిన్న నెగిటివ్ అంశాలు వచ్చినా.. ప్రజా జీవితం లో ఉన్న వారు తీవ్రంగా ప్రభావితం కావాల్సి ఉంటుంది.
అందుకే.. నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నా.. బయట కు మాత్రం ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా ఉంటారు. అయితే.. ఇలాంటి తీరుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు ప్రాశ్చాత్య దేశాల నేతలు. తాజాగా ఆ జాబితా లోకి చేరారు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.
దాదాపు పద్దెనిమిదేళ్ల బంధానికి తామిద్దరం ముగింపు పలుకుతున్నట్లుగా దేశ ప్రధాని ప్రకటించారు. సుదీర్ఘ చర్చల అనంతరం.. ఈ కీలక నిర్ణయాన్ని తాము తీసుకున్నట్లుగా చెప్పారు. విడాకుల విషయాన్ని ప్రధాని సతీమణి సోఫీ గ్రెగరీ ఇన్ స్టాలో షేర్ చేశారు. అంతేకాదు.. ఇప్పటికే వీరిద్దరూ విడాకుల పత్రాల మీద సంతకాలు చేసినట్లుగా సమాచారం బయట కు వచ్చేసింది.
ఈ జంట కు ఇద్దరు అబ్బాయిలు.. ఒక అమ్మాయి సంతానం. 2005లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. తాజాగా విడాకుల బాట పట్టటం సంచలనంగా మారింది. దేశ ప్రధానిగా ఉంటూ విడాకులు తీసుకున్న ప్రధానమంత్రి జాబితా లో తాజాగా ట్రోడో చేరారు.
విడాకులు తీసుకున్న రెండో ప్రధానిగా నిలిచారు. మాజీ ప్రధాని పియరీ కూడా విడాకులు తీసుకోవటం గమనార్హం. పెళ్లైన పదేళ్లకు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తాజాగా విడాకులు తీసుకోవటం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.