Begin typing your search above and press return to search.

బిగ్ అలర్ట్... కెనడా – భారత్ పౌరులకు కీలక సూచనలు!

అందువల్ల... కెనడాలో ఉన్న భారతీయులు, కెనడా వెళ్లాలని భావిస్తున్నవారు జాగ్రత్తగా ఉండాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

By:  Tupaki Desk   |   20 Sep 2023 4:20 AM GMT
బిగ్  అలర్ట్... కెనడా – భారత్  పౌరులకు కీలక సూచనలు!
X

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్‌ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంలో అటు కెనడా.. ఇటు భారత్‌ దౌత్య అధికారులను దేశం విడిచివెళ్లాలని ఆదేశాలను ఇప్పటికే జారీ చేశాయి. ఇదే సమయంలో ఇరుదేశాల ప్రజలకు కీలక సూచనలు అందాయి.

అవును... ఖలిస్తాన్ అధినేత కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ మరణంపై భారతదేశం, కెనడా మధ్య ఉద్రిక్తత నెలకొని ఉన్న నేపథ్యంలో.. భారత్‌ లో పర్యటిస్తున్న తమ పౌరులకు కెనడా పలు హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌ లో కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

భారత్‌ లో ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. రక్షణ, భద్రతా సమస్యలు ఎప్పుడైనా ఉత్పన్నం అన్నే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిరంతరం అప్రమత్తంగా ఉండండి అని సూచించింది. ఇదే సమ్మయంలో స్థానిక అధికారుల సూచనలను మీడియాలో ఎప్పటికప్పుడు అనుసరించండి అని తెలిపింది.

అనంతరం... అత్యవసరం అయితే తప్ప భారత్‌ ప్రయాణం చేపట్టవద్దు. మీ భద్రతను ప్రమాదంలో పెట్టవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే భారత్ లోనే ఉంటే కచ్చితంగా అక్కడే ఉండాల్సిన అవసరం గురించి ఆలోచించండి. ఒకవేళ అక్కడ కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేకుంటే వెంటనే ఆ దేశాన్ని వదిలి వచ్చేయండి అని కెనడా ప్రభుత్వం తెలిపింది.

మరిముఖ్యంగా అనూహ్యమైన భద్రత పరిస్థితుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ కు ప్రయాణం మానుకోవాలని తమ పౌరులకు కెనడా సూచించింది. ఉగ్రముప్పు, మిలిటెన్సీ, కిడ్నాప్‌ ముప్పు నేపథ్యంలో ఆ ప్రాంతంలో అస్సలు పర్యటించవద్దని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ వెబ్ సైట్ లో ఈ వివరాలు పొందుపరిచింది.

ఇదే సమయంలో కెనడాకు వెళ్లే తమ పౌరుల కోసం ఇండియా తన ప్రయాణ సలహాను కూడా అప్ డేట్ చేసింది. ఇందులో భాగంగా కెనడాలో మతపరమైన హింస, ద్వేషపూరిత నేరాల సంఘటనలు, భారత వ్యతిరేక కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. అందువల్ల... కెనడాలో ఉన్న భారతీయులు, కెనడా వెళ్లాలని భావిస్తున్నవారు జాగ్రత్తగా ఉండాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా... ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్‌ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఖలిస్థానీ ఉగ్రవాది అంశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎందుకు సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారనే చర్చ మొదలైన నేపథ్యంలో... ఖలిస్థానీల మద్ధతును కూడగట్టుకోవడం వంటి కొన్ని రాజకీయ సమీకరణాల కోసమే ట్రూడో ఈ చర్యలకు పాల్పడ్డారని విశ్లేషకులు అంటున్నారు.