కెనడా ప్రధాని ఎదుట మోడీ మాట్లాడిన రోజు అలా జరిగింది
భారత వ్యతిరేక శక్తులు కెనడాలో తిష్టవేశాయని కెనడా ప్రధాని ట్రూడో ఎదుటే ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేసిన వేళ
By: Tupaki Desk | 12 Sep 2023 4:12 AM GMTఎంతటి ప్రజాస్వామ్యమైతే? భావస్వేచ్ఛ ఎంత ఎక్కువగా ఉంటే మాత్రం.. ఇష్టారాజ్యంగా ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే చర్యల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా తమకు తోచినట్లుగా వ్యవహరించే అరాచవాదుల తీరు ఒక ఎత్తు అయితే.. అలాంటి వారిని అడ్డుకోకుండా వ్యవహరించే ప్రభుత్వాల తీరు తప్పు పట్టేలా ఉంది. జీ20 సమ్మిట్ వేళ.. కెనడా ప్రధాని ఎదుట ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల వేళలోనే ఆ దేశంలో చోటు చేసుకున్న ఒక పరిణామం షాకింగ్ గా మారింది.
భారత వ్యతిరేక శక్తులు కెనడాలో తిష్టవేశాయని కెనడా ప్రధాని ట్రూడో ఎదుటే ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేసిన వేళ.. ఆ దేశంలోని సుర్రే పట్టణంలో ఖలిస్థాన్ ఏర్పాటుపై సిఖ్స్ ఫర్ జస్టిస్ వేర్పాటు సంస్థ ఏకంగా రెఫరెండం నిర్వహించటం గమనార్హం. గురుపత్వంత్ సింగ్ పన్నూ సారథ్యంలో నిర్వహించిన ఈ రెఫరెండంలో ఏడు వేల మంది వరకు పాల్గొన్నట్లు చెబుతున్నారు. సుమారు 50 వేల మంది వరకు దీనికి హాజరవుతారని అంచనా వేసినా.. ఏడు వేల మంది మాత్రమే రావటం గమనార్హం.
భారీ వ్యక్తిగత భద్రత నడుమ రెఫరెండం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత వ్యతిరేక విద్వేష ప్రసంగాన్ని చేసిన అతడి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 50వేల మంది వరకు హాజరవుతారని భావించినా.. 7వేల మంది మాత్రమే రావటంతో ఈ ప్రోగ్రాం ఫెయిల్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది.
అయితే.. వేర్పాటు శక్తుల గురించి కెనడా ప్రధాని ఎదుట దేశ ప్రధాని మోడీ ప్రస్తావించిన రోజునే.. ఆ దేశంలో రిఫెరెండం నిర్వహించటం చూస్తే.. ఈ వ్యవహారంపై భారత్ మరింత ఘాటుగా రియాక్టు కావాల్సిన అవసరం ఉందని చెప్పాలి.
ఈ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లుగా చెప్పే పత్వంత్ సింగ్ జీ20 సమ్మిట్ కు ముందు ఒక ఆడియో మెసేజ్ ను విడుదల చేశారు. ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతున్న ప్రగతి మైనాద్ ప్రాంగణానికి భారీ సంఖ్యలో వెళ్లి నిరసన గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు. కశ్మీర్ లోయలో నివసించే ముస్లింలకు పిలుపునిచ్చిన ఇతగాడి వైఖరిపై మరింత సీరియస్ గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.