Begin typing your search above and press return to search.

వైసీపీ అండ్ జగన్ బెయిల్ రద్దు... ఎందుకు ఈ సోది

ఇక వ్యక్తిగత వివాదాలుగా ఉన్న అన్నా చెల్లెలు ఆస్తి వ్యవహారాల్లో మాత్రం హైలెట్ చేస్తూ తాను ఎవరో వేసిన ట్రాప్ లో పడుతోంది.

By:  Tupaki Desk   |   30 Oct 2024 12:30 PM GMT
వైసీపీ అండ్ జగన్ బెయిల్ రద్దు... ఎందుకు ఈ సోది
X

వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్నో వివాదాలు వస్తున్నాయి. కొన్ని కావాలని వైసీపీ రాసుకుని పూసుకుంటోంది.అధికార తెలుగుదేశం కూటమి మీద నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సిన వైసీపీ ఆ విషయంలో చోద్యం చిత్తగిస్తోంది.

ఇక వ్యక్తిగత వివాదాలుగా ఉన్న అన్నా చెల్లెలు ఆస్తి వ్యవహారాల్లో మాత్రం హైలెట్ చేస్తూ తాను ఎవరో వేసిన ట్రాప్ లో పడుతోంది. వైసీపీకి 11 అసెంబ్లీ సీట్లే రావచ్చు. కానీ 40 శాతం ఓటు షేర్ దక్కింది. దాంతో ఆ పార్టీ మీద ప్రజలు పెద్ద బాధ్యతనే పెట్టారు అనుకోవాలి.

మరి ప్రజల వైపు నుంచి సమస్యల పరిష్కారం దిశగా వైసీపీ ఆలోచన చేస్తోందా అంటే జవాబు లేదు అనే వస్తోంది. దానికి తోడు ఈ వివాదాలు ఏంటి వైసీపీ లో జగన్ బెయిల్ రద్దు అంటూ అన్నా చెల్లెళ్ల వివాదంలో తలదూర్చి అదే ప్రపంచ సమస్యగా చేసుకోవడం ఏంటి అన్న చర్చ అయితే వస్తోంది.

విషయానికి వస్తే ఈ ఆస్తుల వివాదాలలో కూడా ఎన్నో లాజిక్కులకు అందని సందేహాలు ఉన్నాయి. తరచి చూస్తే కనుక ఆస్తులలో వచ్చిన లాభాలను పంచుకుంటున్నారు కదా. మరి అలాంటపుడు బెయిల్ రద్దు కాదా అన్న చర్చ సాగుతోంది. షేర్లు ట్రాన్స్ ఫర్ చేస్తే బెయిల్ రద్దు ఎందుకు అవుతుంది అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

ఇక షేర్లు అనేవి కంపెనీలో ఎవరు అయినా కొనుక్కోవచ్చు కదా అన్న మాట కూడా వినిపిస్తోంది. ఈ విషయంలో వైసీపీకి చెందిన నేతలు ఎదురు దాడినే ఎంచుకుంటున్నారు తప్పించి అందులో లాజిక్ ని చూడడం లేదని అంటున్నారు. నిజానికి ఆస్తుల గొడవ అన్నది పూర్తిగా వ్యక్తిగతమైనది. ఆ విషయంలోనే టైం మొత్తం కేటాయించేస్తూ ఆయాసపడటం కంటే ప్రతిపక్ష పాత్రను పోషించడం మీద ఆసక్తిని పెంచుకుంటే పార్టీకి లాభం కదా అని అంటున్నారు.

కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అయితే అమలు చేయడం లేదు అని విమర్శలు ఉన్నాయి. జనాలలో దీని మీద కొంత అసంతృప్తి ఉంది. మరి ఆ విషయాల మీద వైసీపీ నేతలు ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు అని అంటున్నారు.

సూపర్ సిక్స్ హామీల అమలుకు వైసీపీకి నేతలూ పోరాడండి అని జనాల నుంచి వస్తున్న మాటగా ఉంది. దానికి వదిలేసి షర్మిల జగన్ ఆస్తుల మీద పోరాటం అంటే జనాలకు ఏమి ఆసక్తి ఉంటుంది అని అంటున్నారు. అసలు వారికి ఈ విషయాలతో ఏమి సంబంధం అని కూడా అంటున్నారు.

ఇక ఆస్తుల వివాదం వారిద్దరిది. షర్మిల జగన్ ఇద్దరూ కూడా ఈ విషయంలో స్వార్ధపరులు అని అర్ధం అవుతోంది అంటున్నారు. అయితే ఎవరికి వారు తామే న్యాయంగా ఉన్నామని అన్నటుగా యాక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే తగుదునమ్మా అని మీడియా ముందుకు వచ్చేస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని వంటి వారికి జగన్ ఆస్తులు ఏంటో అసలు వైఎస్సార్ కుటుంబం ఆస్తులు ఏమిటో ఎలా తెలుస్తుంది. ఆయనకు వీటి మీద ఏ మేరకు అవగాహన ఉంటుంది అని కూడా అంతా అంటున్న నేపథ్యం ఉంది.

ఆయన ప్రతీసారీ మీడియా ముందుకు వచ్చి ఈ ఆస్తుల ఇష్యూ మీద ఎందుకు మాట్లాడడం అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ విధంగా వైసీపీ అసలు సమస్యలను పక్కన పెట్టేసి కొసరు సమస్యల మీద దృష్టి పెట్టడం ఏ మేరకు సమంజసం అని కూడా అంటున్నారు.

ఆయన ఒక్కరే కాదు వైసీపీ నేతలు వైఎస్సార్ కుటుంబం ఆస్తులు ఆ గొడవలు ఏమి తెలుసు. అవన్నీ పూర్తిగా వారి పర్సనల్ ఇష్యూస్.వాటి విషయంలో అనవసరంగా ఉత్సాహం చూపించి తాము అభాసుపాలు కావడం పార్టీని అభాసు చేయడం తప్ప ఒరిగేది ఏమి ఉంటుంది అని అంటున్నారు.

అసలు పార్టీ వేరు పర్సనల్ వేరు అన్నది ఎందుకు గుర్తించలేకపోతున్నారు వైసీపీ నేతలు అన్న చర్చ కూడా వస్తోంది. వైసీపీకి ఇటీవల ఎన్నికల్లో 40 శాతం ఓటు షేర్ వచ్చింది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ విధంగా వైసీపీ తన పెర్ఫార్మెన్స్ చేసి సత్తా చాటింది. అంటే కష్టపడితే మళ్లీ చాన్స్ ఉంటుందనే కదా ఈ రిజల్ట్ చెబుతోంది.

అందువల్ల పార్టీ కోసం ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం వైసీపీ నేతలు దృష్టి పెట్టాలని అంటున్నారు. అలా కాకుండా ఎంత సేపూ పర్సనల్ వివాదాలు గొడవల మీద ఫోకస్ పెట్టడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని అంటున్నారు. దాని వల్ల వైసీపీకి డ్యామేజ్ తప్ప కొత్తగా వచ్చే పొలిటికల్ మైలేజ్ ఏమీ ఉండదని అంటున్నారు.