తల్లి గర్భంలోనే క్యాన్సర్ కు బీజం... తెరపైకి షాకింగ్ విషయం!
ఈ సమయంలో తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు ఓ షాకింగ్ విషయం వెల్లడించారు.
By: Tupaki Desk | 1 Feb 2025 4:16 AM GMTప్రపంచంలో అతి ప్రమాదకర వ్యాధి క్యాన్సర్ అనే సంగతి తెలిసిందే. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా రావొచ్చు! ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మరణాలకు రెండో ప్రధాన కారణం క్యాన్సర్ అని అంటే.. దీని తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. ఈ సమయంలో తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు ఓ షాకింగ్ విషయం వెల్లడించారు.
అవును... తాజాగా క్యాన్సర్ ముప్పుకు సంబంధించిన అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో కీలక విషయం వెల్లడైనట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... తల్లి గర్భంలో ఎదుగుతున్న దశలోనే క్యాన్సర్ ముప్పుకు బీజం పడోచ్చని చెబుతున్నారు. ఈ మేరకు రెండు విభిన్న ఎపిజెనెటిక్ దశల్లో దీనికి సంబంధం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది.
ఈ సందర్భంగా స్పందించిన శాస్త్రవేత్తలు.. తల్లి గర్భంలో ఎదుగుతున్న దశలోనే క్యన్సర్ ముప్పుకు బీజం పడోచ్చని.. వయసు పెరిగేకొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతునే ఉంటుందని తెలిపారు. దీనికి కారణం... డీఎన్ఏ కి జరిగే నష్టం క్రమంగా పేరుకుపోవడంతోపాటు మరికొన్ని ఉన్నాయని అన్నారు. అలా అని అసాధారణమైన ప్రతీ కణమూ క్యాన్సర్ గా మారదని తెలిపారు.
ఇదే సమయంలో... ఎపిజెనెటిక్ అంశాలూ క్యాన్సర్ కు కారణమవుతున్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించిన శాస్త్రవేత్తలు.. జన్యువుల పనితీరుపై ప్రభావం చూపే ప్రక్రియలను ఎపిజెనెటిక్స్ గా పేర్కొన్నారు. ఇందులో సమస్యలు ఎదురైనప్పుడు కణ నాణ్యత నియంత్రణ ప్రక్రియలు దెబ్బతింటాయని.. ఫలితంగా అనారోగ్య కణాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
ఇదే క్రమంలో... ఇటీవల ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి మరో విషయాన్ని గుర్తించారు. ఇందులో భాగంగా.. ట్రిమ్28 అనే జన్యువూ స్థాయి తగ్గితే.. క్యాన్సర్ సంబంధ జన్యువులపై రెండు రకాల ఎపిజెనెటిక్ ముద్రలో ఏదో ఒక పోకడ ప్రభావం చూపవచ్చు అని.. కడుపులో ఎదుగుతున్న దశలోనే ఇవి రూపుదిద్దుకుంటాయని తెలిపారు.
ఇందులో.. ఒక దానిలో తక్కువ రిస్కు, మరో దానిలో ఎక్కువ రిస్కు ఉంటుందని చెప్పిన శాస్త్రవేత్తలు.. దాని వల్ల ఎలాంటి రకాల క్యాన్సర్లు వస్తాయనేది వివరించారు. ఇందులో భాగంగా... తక్కువ ముప్పు కలిగినవారికి క్యాన్సర్ వస్తే.. లుకేమియా, లింఫోమా వంటి ట్యూమర్స్ రావడానికి అవ్కాశం ఉందని అన్నారు. ఇవి ద్రవ రూప ట్యూమర్లు!
ఇదే సమయంలో... ఎక్కువ రిస్కు ఉన్నవారికి క్యాన్సర్ ఉత్పన్నమైతే.. ప్రొస్టేట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ఘన రూప ట్యూమర్లు రావడానికి అవకాశం ఎక్కువ అని చెబుతున్నారు.