Begin typing your search above and press return to search.

జాన్సన్ బేబీ పౌడర్‌ లో క్యాన్సర్... రూ.375 కోట్ల పరిహారం!

జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌ వాడటం వల్ల క్యాన్సర్ సోకుతోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

By:  Tupaki Desk   |   22 April 2024 11:30 AM GMT
జాన్సన్  బేబీ పౌడర్‌  లో క్యాన్సర్... రూ.375 కోట్ల పరిహారం!
X

ప్రఖ్యాత జాన్సన్ అండ్ జాన్సన్, కెన్ వ్యూ కంపెనీకి భారీ షాక్‌ తగిలింది. ఓ కుటుంబానికి 45 మిలియన్ డాలర్లు (సుమారు రూ.375 కోట్లు) పరిహారం కట్టాలని కోర్టు ఆదేశించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ కి చెందిన ఓ మహిళ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీపై కేసు వేయడమే దీనికి కారణం. జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌ వాడటం వల్ల క్యాన్సర్ సోకుతోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

అవును... జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ వాడటం వల్ల తనకు క్యాన్సర్ వచ్చిందంటూ అమెరికాలోని ఓ మహిళ సుమారు పదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా... ఈ పౌడర్‌ లో క్యాన్సర్ కారక రసాయనాలున్నాయని ఆమె పోరాటం మొదలు పెట్టింది. ఈ క్రమంలో సుమారు పదేళ్ల పోరాటం తర్వాత ఆమె కేసు గెలిచారు. ఈ మేరకు కోర్టు జాన్సన్ కంపెనీ ఈ భారీ పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... 2020 సంవత్సరంలో మెసాథెలియోమా అనే క్యాన్సర్ సోకడంతో థెరిసా గ్రెసియా మృతి చెందింది. దీంతో... ఆమె కుటుంబ సభ్యులు జాన్సన్ అండ్ జాన్సన్, కెన్ వ్యూ సంస్థలపై కేసు వేశారు. ఈ సంస్థలు విక్రయిస్తున్న పౌడర్‌ లో ఆస్బెస్టాస్ ఉందని వారు ఆరోపించారు. ఈ పౌడర్‌ లోని ఆ అవశేషాలే థెరిసా గ్రేసియాకు క్యాన్సర్‌ సోకేలా చేశాయమని పిటిషన్‌ లో పేర్కొన్నారు.

వాస్తవానికి మెసాథెలియోమా క్యాన్సర్‌ చాలా అరుదైందే అయినా ప్రాణాంతకమైనదే. ఊపిరితిత్తులు లేదా పొత్తికడుపులోని పొరల్లో ఈ కణాలు పెరుగడంతో ఈ వ్యాది సంక్రమిస్తుంది. ఆస్బెస్టాస్ ఎక్కువగా శరీరానికి తాకినప్పుడో, ఆ దుమ్ముని పీల్చినప్పుడో ఈ క్యాన్సర్‌ సోకుతుందని చెబుతున్నారు. అయితే... ఆ పౌడర్‌ లో ఈ ఆస్బెస్టాస్ ఉండడం వల్లే ఆమెకి క్యాన్సర్ సోకిందని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

ఈ క్రమంలో... ఈ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం థెరిసా గ్రెసియా మృతికి 70% మేర కెన్ వ్యూ సంస్థ.. మిగతా 30% మేర జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థే కారణమని స్పష్టం చేసింది. అయితే... జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ మాత్రం తాము తయారు చేస్తున్న టాల్కం పౌడర్‌ లో క్యాన్సర్ కారకాలు ఏమీ లేవని వాదిస్తోంది.

దాదాపు వందేళ్లుగా తమ ప్రొడక్ట్‌ ని సరైన విధంగానే బ్రాండింగ్ చేసుకుంటున్నట్టు జాన్సన్ అండ్ జాన్సన్ వివరించింది. కెన్ వ్యూ సంస్థ మాత్రం టాల్కం పౌడర్‌ ని ఇకపై తయారు చేయమని వెల్లడించింది.