క్యాన్సర్ పేషెంటే.. రూ. 10 వేల కోట్లు కొట్టేశాడు!
లావోస్ కుచెందిన 46 ఏళ్ల చెంగ్ సైఫాన్ కొన్నాళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చాడు.
By: Tupaki Desk | 1 May 2024 5:30 PM GMTలక్కుంటే ఏదైనా కలిసొస్తుంది. అమ్ముల పొదిలో ఉన్నదే అస్త్రంగా మారుతుంది. మనం సప్త సముద్రాల అవతల ఉన్నా మన విజయం ఖాయం అవుతుంది. అలా ఓ క్యాన్సర్ బాధితుడికి ఏకంగా రూ. 10 వేల కోట్ల జాక్ పాట్ కొట్టాడంటే అతిశయోక్తి కాదు. అతడికి లక్ అలా కలిసొచ్చింది. అంతే రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. జీవితమే మారిపోయింది.
లావోస్ కుచెందిన 46 ఏళ్ల చెంగ్ సైఫాన్ కొన్నాళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చాడు. అతడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎనిమిదేళ్లుగా కీమోథెరపీ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి ఓ ఆలోచన వచ్చింది. తాను ఓ లాటరీ టికెట్ కొనుక్కోవాలని భావించాడు. అనుకున్నదే తడవుగా టికెట్ కొన్నాడు. ఇంకేముంది డ్రాలో అతడికి లాటరీ తగిలింది.
పవర్ బాల్ లాటరీలో ఒక టికెట్ మొత్తం ఐదు నంబర్లు (22,27,44,52,69)తో సరిపోలిందని దీని విలువ 1.3 బిలియన్ డాలర్లు (రూ. 10 వేల 842 కోట్లకు పైగా ) అని నిర్వాహకులు తెలిపారు. లక్ కలిసి రావాలి కానీ ఎంతటి లాటరీ అయినా మన సొంతం అవుతుంది. అతడికి అంత మొత్తంలో కలిసి రావడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.
అతడికి దక్కిన లాటరీలో టాక్స్ లో భాగంగా 422 మిలియన్లు తగ్గించుకుని ఆ మొత్తాన్ని చెల్లించేందుకు నిర్వాహకులు అంగీకరించారు. తనకు టికెట్ కొనుగోలు చేసేందుకు సహకరించిన తన భార్య, స్నేహితుడితో డబ్బు పంచుకుంటానని చెబుతున్నాడు. తన రోగానికి మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ఈ డబ్బు వినియోగిస్తానని తెలిపాడు.
పవర్ బాల్ చరిత్రలో ఇది నాలుగో అతిపెద్ద లాటరీ. ఇంత మొత్తంలో నగదు గెలుచుకోవడం అతడికి లక్కే. నక్కను తొక్కాడని లాటరీ నిర్వాహకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో నగదు లభించడం అతడికి వరంగా భావిస్తున్నారు. విధి అంటే అదే మరి. ఎక్కడో ఉండాల్సిన వారిని ఎక్కడకో తీసుకెళ్తుందని పలువురు వ్యాఖ్యానించడం కొసమెరుపు.