Begin typing your search above and press return to search.

అభ్యర్థులు ఫైనల్...! జనసేన పోటీచేసే అసెంబ్లీ, లోక్ సభ స్థానాలివే!

ఇందులో భాగంగా జనసేన అభ్యర్థులు కూడా ఫైనల్ అయ్యారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 6:10 AM GMT
అభ్యర్థులు ఫైనల్...! జనసేన పోటీచేసే అసెంబ్లీ, లోక్ సభ స్థానాలివే!
X

ఎన్నికలు సమీపిస్తున్నాయంటే ఏ పార్టీకైనా అభ్యర్థుల ఎంపిక అనేది ప్రధాన విషయం! ప్రధానంగా సామాజిక సమీకరణలు ఈ విషయంలో కీలక భూమిక పోషిస్తుంటాయి. ఇక పొత్తులో ఉన్న పార్టీలకైతే ఈ సర్ధుబాటు మరింత క్లిష్టంగా ఉంటుంది. ఈ సమయంలో ఏపీలో పొత్తులో ఉన్న టీడీపీ - జనసేనలు కూడా సీట్ల సర్ధుబాటులో ఒక క్లారిటీకి వచ్చాయని అంటున్నారు. ఇందులో భాగంగా జనసేన అభ్యర్థులు కూడా ఫైనల్ అయ్యారని ఆ లిస్ట్ సోషల్ మీడియా లో ఇదే అంటూ వైరల్ చేస్తున్నారు.

అవును... టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలు, కేటాయింపుల మేరకు ఫైనల్ అయిన స్థానాల్లో జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్దులను పవన్ కల్యాణ్ దాదాపు డిసైడ్ చేసారని చెబుతున్నారు. ఈ లిస్ట్ లో కొత్తవారికి దాదాపు అవకాశాలు ఇవ్వలేదని, సీనియర్లకే పెద్ద పీట వేశారని తెలుస్తుంది. మరోపక్క ఈ దఫా కూడా పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!

ఈ క్రమంలో... పొత్తులో భాగంగా జనసేనకు 27 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లు కేటాయింపు జరిగిందని.. ఇందుకు జనసేన అధినేత పవన్ నుంచి అంగీకారం వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు... 27 అసెంబ్లీ స్థానాలతోపాటు మచిలీపట్నం, అనకాపల్లి లోక్ సభ స్థానాలు జనసేనకు కేటాయించటం దాదాపు ఖాయమైందని తెలుస్తుంది. ఇక మూడోస్థానం నరసాపురం విషయంలో రఘురామ కృష్ణంరాజు రూపంలో అడ్డుతగిలిందని అంటున్నారు!

ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే... పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో భీమవరంతో పాటు ఈసారి తిరుపతిలోనూ పవన్ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో జనసేన కీలక నేత అయిన నాదెండ్ల మనోహర్.. తాను ముందుగా ప్రకటించుకున్నట్లుగానే తెనాలి నుంచి పోటీ చేయనున్నారు.

ఇక ఈ జాబితాలో ప్రధానంగా... రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్, రాజోలు నుంచి డిఎంఆర్ శేఖర్, తాడేపల్లిగూడెం నుంచి బొల్లి శెట్టి శ్రీనివాస్, నరసాపురంలో బొమ్మిడి నాయకర్, విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్ పోటీ కన్ ఫాం అని అంటున్నారు. ఇలా జనసేన పోటీ చేయబోయే అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇన్ ఛార్జ్ ల బుజ్జగింపులు ఇప్పటికే పూర్తయ్యాయని అంటున్నారు!

ప్రస్తుతానికి జనసేనకు కేటాయించిన 27 స్థానాలకు గానూ 21 స్థానాల్లో అభ్యర్థులు ఆల్ మోస్ట్ ఫైనల్ అని, వారి పేర్లు ఇవేనని తెలుస్తుంది! ఇందులో భాగంగా...

నెల్లిమర్ల - లోకం నాగ మాధవి

గజపతిపురం - పడాల అరుణ

గాజువాక - సుందరపు సతీష్

భీమిలి - పంచకర్ల సందీప్

పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు

యలమంచిలి - సుందరపు విజయ్ కుమార్

కాకినాడ రూరల్ - పంతం నానాజీ

పిఠాపురం - ఉదయ శ్రీనివాస్

రాజానగరం - బత్తుల బలరామకృష్ణ

రాజమండ్రి రూరల్ - కందుల దుర్గేష్

రామచంద్రాపురం - దొరబాబు

జగ్గంపేట - పాలెంశెట్టి సూర్యచంద్రరావు

ముమ్మిడివరం - పీతాని బాలకృష్ణ

రాజోలు - డిఎంఆర్ శేఖర్

నరసాపురం - బొమ్మిడి నాయకర్

భీమవరం - పవన్ కళ్యాణ్

తణుకు - విడవడ రామచంద్రరావు

తాడేపల్లిగూడెం - బొల్లిశెట్టి శ్రీనివాస్

విజయవాడ వెస్ట్ - పోతిన మహేష్

తెనాలి - నాదెండ్ల మనోహర్

గిద్దలూరు - ఆమంచి శ్రీనివాసరావు పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.