Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు కొత్త అందం... ఏమిటీ న్యూయార్క్ తరహా సెంట్రల్ పార్క్?

ఇందులో భాగంగా.. హైదరాబాద్ లో కేపబిలిటీ సెంటర్ ను విస్తరించి సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించిందని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   11 Aug 2024 4:01 AM GMT
హైదరాబాద్  కు కొత్త అందం... ఏమిటీ న్యూయార్క్  తరహా సెంట్రల్  పార్క్?
X

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం ప్రముఖ కంపెనీ అధిపతులు, ప్రతినిధులను కలుస్తున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సాగుతోన్న ఈ తెలంగాణ సీఎం అమెరికా పర్యటన సందర్భంగా తాజాగా ఆయన కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గూగుల్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం చర్చించింది.

ఇందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లను ఎలా వినియోగించుకోవాలనే అంశంగా చర్చించారు. ఇదే సమయంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు కీత్ సర్ బాగ్, అనిల్ రాఘవ్ లు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

ఇందులో భాగంగా.. హైదరాబాద్ లో కేపబిలిటీ సెంటర్ ను విస్తరించి సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించిందని వెల్లడించారు. ఈ సందర్భంగా... భారత్ లో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని జోయిటిస్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కిత్ సర్ బాగ్ వెల్లడించారు.

ఇదే క్రమంలో... సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇతర ప్రతినిధుల బృందంతో కలిసి కాలిఫోర్నియాలోని స్టాన్ ఫర్డ్ వర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా స్టాన్ ఫర్డ్ బయోడిజైన్ సెంటర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

మరోపక్క సుమారు 843 ఎకరాల్లో విస్తరించి ఉన్న న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో హైదరాబాద్ లోనూ రాజీవ్ పార్క్ ను అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు! ఈ మేరకు ఆయన అధికారులకు సూచనలు చేశారు. దీంతో... దీనికి అనువైన ప్రాంతం, అక్కడ స్థలం గురించి అధికారులు కసరత్తులు షురూ చేశారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఈ రాజీవ్ సెంట్రల్ పార్క్ ను సుమారు 4,100 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో పార్క్ చుట్టూ బిలియనీర్ల నివాసాలు, కార్పొరేట్ ఆఫీసులు, ప్రముఖుల నివాసాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.