Begin typing your search above and press return to search.

దౌర్భాగ్యం... అమర జవాన్ భార్యపైనా ట్రోలింగ్!!

తమ కుటుంబం కంటే, తమ వ్యక్తిగత జీవితం కంటే దేశమే ముఖ్యమని భావించి ఆర్మీలో చేరుతుంటారు

By:  Tupaki Desk   |   9 July 2024 9:14 AM GMT
దౌర్భాగ్యం... అమర జవాన్ భార్యపైనా ట్రోలింగ్!!
X

తమ కుటుంబం కంటే, తమ వ్యక్తిగత జీవితం కంటే దేశమే ముఖ్యమని భావించి ఆర్మీలో చేరుతుంటారు. దేశం కోసం ప్రాణాలు లెక్కచేయని ఆ వృత్తి కోసం ఆరాటపడుతుంటారు. ఆర్మీలో జాయిన్ అయినప్పుడే.. ఈ ప్రాణం తమది కాదని, దేశానిదని ఫిక్సయిపోతారు. అలాంటి ఓ కెప్టెన్ కు మరణానంతరం “కీర్తి చక్ర” పురస్కారాన్ని ప్రకటించారు. అది అందుకోవడానికి వచ్చిన ఆయన భార్యపై నెట్టింట కామెంట్లు పెట్టిన సంఘటన తాజాగా జరిగింది.

అవును... మనిషికి స్వేచ్ఛ ముఖ్యమే, వాక్ స్వాతంత్రపు హక్కూ ప్రధానమే కానీ సోషల్ మీడియా కాలంలో విజ్ఞత మరిచిన, సంస్కారం కోల్పోయిన భావ ప్రకటనా స్వేచ్ఛ వెర్రెతలలు వేస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ కెప్టెన్ భార్య కీర్తి చక్ర పురస్కారాన్ని అందుకోవడానికి వచ్చిన సమయంలో ఆమెపై నెట్టింట కామెంట్ చేశారు! ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... దేశం కోసం ప్రాణాలర్పించిన భారత సైనికుడు అంశుమన్ సింగ్ త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతని భార్య స్మృతి ఈ అవార్డును అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విషయాలు విన్న ప్రతి ఒక్క భారతీయుడి కళ్లూ చెమర్చాయి!

ఆ సంగతి అలా ఉంటే... ఈ వీడియోపైనా కొంతమంది నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. దీంతో వీరిపై దేశప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు! అమరుడి భార్యపైనా అసభ్యకరంగా స్పందిస్తూ ట్రోల్ చేస్తున్న వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీకి చెందిన అహ్మద్ అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ను కోరారు.

దీంతో స్పందించిన మహిళా కమిషన్... ఆ యువకుడు చేసిన అసభ్యకరమైన కామెంట్లను తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ పోలీసులు తక్షణమే అతడిని అరెస్ట్ చేయాలని, మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

కాగా... గత ఏడాది జూలై 19 తెల్లవారుజామున మందుగుండు సామాగ్రి నిల్వ ఉంచిన ప్రదేశంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో మంటలు పక్కనే ఉన్న ఫైబర్ గ్లాస్ గుడారానికీ అంటుకోవడంతో అందులో చిక్కుకున్నవారిని కాపాడేందుకు కెప్టెన్ డాక్టర్ అన్షుమన్ సింగ్ లోపలకు పరుగుతీశారు. ఈ సమయంలో సుమారు నలురురైదుగురిని కాపాడారు!

అయితే ఈ గుడారానికి పక్కనున్న ల్యాబ్ గదిలోకి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో మరోసారి లోపలికి వెళ్లిన ఆయన ఆ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గత ఏడాది జూలై 22న ఉత్తరప్రదేశ్ లోని భగల్ పూర్ పూర్తి అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి! అనంతరం ఆయనకు ఇటీవల కీర్తి చక్ర ప్రకటించారు.