Begin typing your search above and press return to search.

ఫుట్‌ పాత్‌ పై నడిచినా నో సేఫ్టీ అంటే ఎలా... వీడియో వైరల్‌!

అవును... కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ యాక్సిడెంట్‌ గూస్‌ బంప్స్‌ ను కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   20 Oct 2023 5:53 AM GMT
ఫుట్‌  పాత్‌  పై నడిచినా నో సేఫ్టీ అంటే ఎలా... వీడియో వైరల్‌!
X

దేశంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికమైపోతున్నాయని రికార్డ్ చెబుతున్నాయని అంటున్నారు. ప్రతిరోజూ ఎక్కడో ఏదో ఓ మూల వందలకొద్దీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన, మితిమీరిన వేగం, నిర్లక్ష్యం... కారణం ఏదైనా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫుట్ పాత్ పై నడిచినా కూడా సెఫ్టీ లేని పరిస్థితులు వచ్చేశాయి.

సీసీటీవీ కెమెరాలు, కార్లలో అమర్చిన అధునాతన టెక్నాలజీ కారణంగా ప్రమాదాలు జరిగిన తీరును ప్రపంచం తెలుసుకోగలుతుంది. అయితే రోడ్డు ప్రమాదాల్లో మెజార్టీ ప్రమాదాలకు మితిమీరిన వేగం, తాగి వాహనం నడపడం కారణం అని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఫుట్‌ పాత్‌ పై వెళ్తున్న ఐదుగురు యువతులను వేగంగా వస్తున్న ఓ కారు ఢీకొట్టింది. ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి.

అవును... కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ యాక్సిడెంట్‌ గూస్‌ బంప్స్‌ ను కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఈ ప్రమాధానికి సంబంధించిన వీడియో చూసినవారెవరైనా ఇలాంటి భావనకు లోనయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. పద్దతిగా ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్నవారికి కూడా రక్షణలేదా అనే కామెంట్లు ఈ వీడియో చూసిన వారికి కలగక మానదు!

మంగళూరులోని లేడీ హిల్స్ లో ఫుట్‌ పాత్‌ ఐదుగురు యువతులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. అనంతరం ఆగకుండా మందుకు దూసుకెళ్లి పోయింది. ఈ ఘటనలో రూపశ్రీ(23) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా స్వాతి (26), హితన్వి (16), కార్తీక (16), యతిక (12)లు గాయపడ్డారని తెలుస్తుంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సాధారణంగా హై స్పీడ్‌ తో వెళ్తున్న కార్లు డివైడర్‌ ను లేదంటే ఇతర వాహనాలను ఢీకొట్టిన సంఘటనలు రెగ్యులర్ గా జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఫుట్‌ పాత్‌ పై వెళ్తున్న వారిపైకి అత్యంత వేగంగా ఆ కారు దూసుకువచ్చింది. వారిని ఢీకొట్టిన తర్వాత కూడా అదే వేగాన్ని కంటిన్యూ చేయడం గమనార్హం.

ఈ ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోందని అంటున్నారు. ఈ ప్రమాదం జరగగానే కారు డ్రైవర్ పోలీస్ స్టేషన్‌ లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాధంపై పాండేశ్వర్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది. కారు డ్రైవర్‌ ను కమలేష్ బలదేవ్‌ గా పోలీసులు గుర్తించారని సమాచారం.

ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సిటిజన్ మూవ్‌మెంట్ ఈస్ట్ బెంగళూరు తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది.