కారులో రొమాన్స్ చేస్తున్నారా... ఇదొక్కసారి చదవండి!
ఆల్ మోస్ట్ వాహనాలన్నీ డిజిటల్ అయిపోతున్న తరుణంలో అ వాహనాల వినియోగదారుల పర్సనల్ లైఫ్ మొత్తం ఆ కార్ల కంపెనీల చేతికి చేరుతుందని తాజాగా ఒక ప్రముఖ సంస్థ ఆందోళనకర విషయాలు వెల్లడించింది.
By: Tupaki Desk | 7 Sep 2023 2:30 PM GMTఈ రోజుల్లో ఎవరి పర్సనల్ లైఫ్ అయినా గోప్యత కోల్పోతుందనే చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ నెంబర్ తెలిస్తే చాలనీ ఒకరంటే.. ఫోన్ లో చిన్న బగ్ ఉంటే బ్రతుకు మొత్తం రోడ్డుపైకి వచ్చేస్తుందని మరికొందరు చెబుతుంటారు. ఈ క్రమంలో వాహనాలు సైతం పర్సనల్ విషయాలు దొంగిలించే పనిలో బిజీగా ఉన్నాయని తాజాగా ఒక సంస్థ ఆందోళన కలిగించే సమాచారం వెల్లడించింది.
అవును... ఆల్ మోస్ట్ వాహనాలన్నీ డిజిటల్ అయిపోతున్న తరుణంలో అ వాహనాల వినియోగదారుల పర్సనల్ లైఫ్ మొత్తం ఆ కార్ల కంపెనీల చేతికి చేరుతుందని తాజాగా ఒక ప్రముఖ సంస్థ ఆందోళనకర విషయాలు వెల్లడించింది. వినియోగదారుల ప్రైవసీ విషయంలో ఏ కంపెనీ కూడా సంతృప్తకరమైన ప్రమాణాలు పాటించడం లేదని స్పష్టం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న మొజిల్లా ఫౌండేషన్ అనే సంస్థ సుమారు 25 ప్రముఖ కార్ల బ్రాండ్ లను అధ్యయనం చేసింది. ఈ సమయంలో అత్యంత సంచలన విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... ప్రముఖ కార్ల బ్రాండ్ లు అన్నీ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే యంత్రాలుగా మారి డేటా అమ్ముకునే వ్యాపారంలోకి ప్రవేశించాయని తెలిపింది.
ఇదే సమయంలో వినియోగదారుల లైంగిక కార్యకలాపాలు సహా అత్యంత సున్నితమైన సమాచారాన్ని సైతం సేకరించే ప్రయత్నం చేసినట్లుగా తాము గుర్తించామని మొజిల్లా బాంబు పేల్చింది. ఈ విషయంలో ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా ముందుందని ఆరోపించింది. అదేవిధంగా... మెజారిటీ బ్రాండ్లు తమ వినియోగదారులకు డేటాను కంట్రోల్ చేసుకునే ఆప్షన్స్ ఇవ్వడం లేదని తెలిపింది.
ఇక ఈ డేటా విక్రయ వ్యాపారంలో భాగంగా... 84 శాతం కార్ బ్రాండ్ లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని డేటా బ్రోకర్లు సహా ఇతర వ్యాపారులతో పంచుకునేందుకు అంగీకరించినట్లు మొజిల్లా అధ్యయనం వెల్లడించింది. వీటిలో 76 శాతం బ్రాండ్ లు ఇప్పటికే కస్టమర్ల డేటాను అమ్మేసినట్లు తెలిపింది.
ఇదే క్రమంలో... కేవలం డ్రైవింగ్ కు సంబంధించిన సమాచారం మాత్రమే కాకుండా.. కారులోని ఎంటర్ టైన్ మెంట్ వ్యవస్థ, రేడియో, గూగుల్ మ్యాప్స్ వంటి వాటి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాయని మొజిల్లా పేర్కొంది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.