Begin typing your search above and press return to search.

రెచ్చగొట్టారు!... ప్రశాంత్ కిశోర్ పై కేసు నమోదు!

అనుమతి లేకుండా విధుల్లోకి వచ్చి వివిధ ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించారని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   30 Dec 2024 4:32 AM GMT
రెచ్చగొట్టారు!...  ప్రశాంత్  కిశోర్  పై కేసు నమోదు!
X

ఎన్నికల వ్యూహకర్తగా పని చేసి అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ కిశోర్ పై బీహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా విధుల్లోకి వచ్చి వివిధ ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించారని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బీహార్ పోలీసులు పీకేపై కేసు నమోదు చేశారు.

అవును.. ప్రశాంత్ కిశోర్ పై కేసు నమోదైంది. పాట్లాలోని గాంధీ మైదాన్ లో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) అభ్యర్థులు నిర్వహిస్తున్న విద్యార్థుల నిరసనను ప్రేరేపించినందుకు ప్రశాంత్ కిశోర్ తో పటు మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ కిశోర్, అతని పార్టీకి చెందిన ఇతర సభ్యులు బీపీఎస్సీ అభ్యర్థులను రెచ్చగొట్టారు.. దీంతో వారు వీధుల్లోకి వచ్చి నగరంలోని వివిధ ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించారు. జిల్లా యంత్రాంగం అనుమతులు ఇవ్వనప్పటికీ ఈ నిరసన చేపట్టినందుకు జన్ సురాజ్ పార్టీ చీఫ్ పై కూడా కేసు నమోదైంది.

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షను పునఃపరిశీలించాలని, ఈ మేరకు బీహార్ సీఎం నితీష్ కుమార్ తో సమావేశం కావాలని కోరుతూ వేలాది మంది అభ్యర్థులు గాంధీ మైదాన్ లో ఆదివారం తమ నిరసనలు కొనసాగించారు. ఈ నెల 13న ప్రారంభమైన ఈ నిరసనకు అనేకమంది రాజకీయ నాయకులు, విద్యావంతుల మద్దతు లభించిందని చెబుతున్నారు.

వాస్తవానికి గాంధీ మైదాన్ లో విద్యార్థి పార్లమెంట్ నిర్వహించాలనే తమ ఉద్దేశ్యాన్ని ప్రశాంత్ కిశోర్ పార్టీ నేతలు శనివారం నాడు జిల్లా యంత్రాంగానికి తెల్లియజేశారు. అయితే.. ఈ అభ్యర్థనను తెలియజేస్తూ సదరు జిల్లా యంత్రాంగం పార్టీకి తమ నిర్ణయాన్ని తెలియపరిచింది. అయినప్పటికీ కార్యక్రమం కొనసాగించారని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ప్రశాంత్ కిశోర్... నిరసనలో ఉన్న అభ్యర్థుల బాధలు వినడానికి సీఎంకు సమయం లేదని.. ఆయన ఢిల్లీకి వెళ్లారని. పరీక్ష రద్దు చేయాలనే డిమాండ్ ను ఆమొదించే వరకూ నిరసన కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటివరకూ అవినీతి, పేపర్ లీక్ లేకుండా బీహార్ లో ఏ పరీక్షా జరగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.