Begin typing your search above and press return to search.

ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడిపై కేసు... తెరపైకి స్వలింగ సంపర్కం వ్యవహారం!

ఈ సందర్భంగా... సూరజ్ తనను ఫాంహౌస్ కి ఆహ్వానించాడని.. బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని.. ఈ క్రమంలో పెదవులు, బుగ్గలు కొరికాడని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 5:07 AM GMT
ప్రజ్వల్  రేవణ్ణ సోదరుడిపై కేసు... తెరపైకి స్వలింగ సంపర్కం  వ్యవహారం!
X

మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కర్ణాటకతో పాటు మొత్తం దేశాన్ని ఏస్థాయిలో కుదిపేసిందనేది తెలిసిన విషయమే. ఈ వ్యవహారంలో ఒక్కో విషయం వెలుగులోకి వస్తూ పలు సంచలనాలు సృష్టించింది. ఈ సమయంలో ఆయన సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కూడా చిక్కుల్లో పడ్డారు. ఇందులో భాయంగా ఆయన స్వలింగ వేధింపులకు పాల్పడ్డారని ఓ కార్యకర్త పోలీస్ స్టేషన్ కు వచ్చారు.

అవును... ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం మరువక ముందే ఆయన సోదరుడు ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కూడా చిక్కుల్లో పడ్డారు. ఇందులో భాగంగా... ఆయన స్వలింగ వేధింపులకు పాల్పడ్డారంటూ ఆ పార్టీ కార్యకర్తే కేసు నమోదు చేశారు. దీంతో నెట్టింట పలు కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి. ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు తేడాగా ఉంటారు.. ఇలా మొత్తమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు!

ఇండియా టుడే కథనం ప్రకారం... హసన్ జిల్లాలోని హోళెనరసిపుర పోలీస్ స్టేషన్ లో సూరజ్ రేవణ్ణపై కేసు నమోదైంది. ఇందులో భాగంగా... జూన్ 16న సూరజ్ రేవణ్ణ తన ఫాంహౌస్ లో బాధితుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఎఫ్.ఐ.ఆర్. లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా... సూరజ్ తనను ఫాంహౌస్ కి ఆహ్వానించాడని.. బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని.. ఈ క్రమంలో పెదవులు, బుగ్గలు కొరికాడని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

విషయం అర్ధమయ్యి అతడికి సహకరించకపోయేసరికి చంపేస్తానని తనను బెదిరించాడని ఫిర్యాదుదారుడు ఆరోపించినట్లు ఆ పత్రిక కథనం పేర్కొంది. దీంతో.. భారత మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ బంధువులకు సంబంధించి ఇది మూడో లైంగిక వేధింపుల కేసు కావడం గమనార్హం.

కాగా... ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలో దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రజ్వల్ తండ్రి.. హె.డీ.రేవణ్ణపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఈ సమయంలో హెచ్.డీ. మరో కుమారుడు, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ తనపై స్వలింగ సంపర్కానికి పాల్పడ్డారంటూ జేడీఎస్ కార్యకర్త ఒకరు ఆరోపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.