Begin typing your search above and press return to search.

రేవణ్ణ.. ఎర్ర చీర.. నల్లగాజులు!?

ఇప్పుడు ప్రజ్వల్‌ వ్యవహారం చాలదన్నట్టు అతడి సోదరుడు సూరజ్‌ రేవణ్ణ వ్యవహారం కలకలం రేపుతోంది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 9:34 AM GMT
రేవణ్ణ.. ఎర్ర చీర.. నల్లగాజులు!?
X

కర్ణాటకలో మాజీ ప్రధాని దేవగౌడ మనుమడు, మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వ్యవహారమే హాట్‌ టాపిక్‌ గా మారగా.. ఇప్పుడు అతడి సోదరుడు, జేడీఎస్‌ ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్ణ వ్యవహారం ఇంకా ప్రకంపనలు రేపుతోంది. తనను సూరజ్‌ రేవణ్ణ అత్యాచారం చేశాడంటూ ఒక యువకుడు ఫిర్యాదు చేయడంతో సూరజ్‌ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

కాగా సూరజ్‌ సోదరుడు ప్రజ్వల్‌ రేవణ్ణ పలువురు మహిళలపై అత్యాచారాలు చేశాడంటూ వేలాది నీలి వీడియోలు ఇప్పటికే కర్ణాటకను షేక్‌ చేశాయి. విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్‌ ఎట్టకేలకు ఇండియాకు తిరిగి రాగానే ఆయనను బెంగళూరు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు.

ఇప్పుడు ప్రజ్వల్‌ వ్యవహారం చాలదన్నట్టు అతడి సోదరుడు సూరజ్‌ రేవణ్ణ వ్యవహారం కలకలం రేపుతోంది. అతడు స్వలింగ సంపర్కుడు అని సూరజ్‌ పై ఫిర్యాదు చేసిన యువకుడు వెల్లడించినట్టు తెలుస్తోంది. అమావాస్య రోజుల్లో సూరజ్‌ రేవణ్ణ ఎర్ర చీర ధరించి.. నల్ల గాజులు వేసుకునేవాడని ఈ కేసును విచారిస్తున్న సీఐడీ అధికారులకు అత్యాచారానికి గురయిన యువకుడు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం.

తనకు 2019 ఎన్నికల çసందర్భంగా అరకలగూడులో సూరజ్‌ పరిచయం అయ్యాడని బాధిత యువకుడు పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. అప్పుడు సూరజ్‌ రేవణ్ణ తన ఫోన్‌ నంబరు తీసుకుని, విజిటింగ్‌ కార్డు ఇచ్చాడని తెలిపాడు. సూరజ్‌ ప్రతి రోజూ తనకు గుడ్‌ మార్నింగ్‌తో పాటు ప్రేమ సందేశాలు పంపించేవాడని పోలీసులకు వివరించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఒకరోజు తనను ఫాంహౌస్‌ కు పిలిపించుకున్నాడని బాధిత యువకుడు నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. మొదట కాళ్లు ఒత్తమని కోరాడని, ఆ తర్వాత తనను బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సీఐడీ అధికారులకు ఆ బాధాకర సందర్భాన్ని వివరించాడని సమాచారం.

సూరజ్‌ రేవణ్ణ చీరకట్టుకుని, గాజులు వేసుకున్న చిత్రాలు అతని సెల్‌ ఫోన్లో ఉన్నాయని బాధిత యువకుడు సీఐడీ అధికారులకు చెప్పాడు. ఈ నేపథ్యంలో సూరజ్‌ ఫోన్‌ ను జప్తు చేసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

కాగా సూరజ్‌ రేవణ్ణ స్వలింగ సంపర్కుడు అని తెలియడంతోపాటు తనతో అసహజ ప్రక్రియల్లో శృంగారానికి బలవంతం చేస్తుండటంతో అతడి భార్య వారి పెళ్లయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకుందని బాధిత యువకుడు సీఐడీ అధికారులకు వివరించినట్టు తెలుస్తోంది. కాగా 2018 మార్చిలో బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో సూరజ్‌– సాగరిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

ఇలా దేవగౌడ మనుమళ్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త అంశం బయటకు వస్తూ క్రైమ్‌ థ్రిల్లర్‌ ను తలపిస్తోంది. రానున్న రోజుల్లో సీఐడీ విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగుచూస్తాయోనని కర్ణాటక అంతటా చర్చ జరుగుతోంది.