విరాట్ కొహ్లీ పబ్ పై కేసు నమోదు... అసలు కారణం ఇదే!
టీంఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీకి చెందిన పబ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
By: Tupaki Desk | 9 July 2024 6:45 AM GMTటీంఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీకి చెందిన పబ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కస్తూరిబా రోడ్డులో విరాట్ కొహ్లీకి చెందిన వన్-9 కమ్యూన్ పబ్ పై ఫిర్యాదులు అందడంతో పాటు, నియమ నిబంధనలను అతిక్రమించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు తొంగలోకి తొక్కి, అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంచినందుకే కేసు నమోదని పోలీసులు చెబుతున్నారు!!
అవును... విరాట్ కొహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ తో పాటు మరికొన్ని పబ్ లు, క్లబ్ లు, ఇతర సంస్థలపై బెంగళూరు పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. నిర్ణీత సమయానికి మించి ఓపెన్ చేసినందుకే ఈ కేసు అని అంటున్నారు. ఈ పబ్ లు అర్ధరాత్రి 1:30 గంటల వరకూ కూడా తెరిచి ఉంచారని చెబుతున్నారు.
ఇదే సమయంలో చర్చి స్ట్రీట్ లోని ఎంపైర్ రెస్టారెంట్, బీగ్రేడ్ రోడ్డులోని పాంజియో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు తెల్లవారు జాము 1:30 గంటల వరకూ పబ్స్ తెరిచి ఉంచారని అంటున్నారు. ఈ పబ్ ఉన్న ప్రాంతంలో అర్థరాత్రి బిగ్గరగా సంగీతం వినిపిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు వెళ్లినట్లు చెబుతున్నారు.
ఆ సమయంలో పబ్ లో అప్పటికి ఇంకా కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.. తదనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. బెంగళూరు చినస్వామి క్రికెట్ స్టే డియంకు సమీపంలో ఉంటుంది ఈ వన్ 8 కమ్యూన్ పబ్!
కాగా... విరాట్ కొహ్లీ కి చెందిన వన్8 కమ్యూన్ ముంబై, ఢిల్లీ, పూణె, కోల్ కతా, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో బ్రాంచ్ లను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్ లో బెంగళూరు బ్రాంచ్ ను ప్రారంభించారు. మరోవైపు విరాట్ కొహ్లీ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. భార్య అనుష్క శర్మ, వామికా, అకాయ్ లు గతకొన్ని రోజులుగా అక్కడే ఉండటంతో టీ20 ప్రపంచ కప్ సంబరాలు ముగిసిన అనంతరం కొహ్లీ కూడా లండన్ వెళ్లిపోయాడు.