జైత్రయాత్ర.. శవయాత్ర.. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
మరొపక్క ఢిల్లీ దొరల మాటలు విని ఆగం ఆగం కావొద్దు.. అభివృద్ధి చూసి ఓటు వేయండి అంటూ బీఆరెస్స్ నేతలు చెప్పుకున్నారు!
By: Tupaki Desk | 29 Nov 2023 11:30 AM GMTతెలంగాణలో నిన్నటివరకూ ప్రచారాలతో హోరెత్తించేశాయి అన్ని రాజకీయ పార్టీలు! ఇందులో భాగంగా బీఆరెస్స్ కు తామంటే తాము ప్రత్యామ్నాయం అంటూ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ప్రచారాలు చేశాయి! మరొపక్క ఢిల్లీ దొరల మాటలు విని ఆగం ఆగం కావొద్దు.. అభివృద్ధి చూసి ఓటు వేయండి అంటూ బీఆరెస్స్ నేతలు చెప్పుకున్నారు!
ఈ సమయంలో హుజూరాబాద్ బీఆరెస్స్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి కాస్త శృతి తప్పారు! ఎమోషన్ అయ్యారో.. లేక, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగారో తెలియదు కానీ... జైత్రయాత్ర, శవయాత్ర అనే మాటలు మాట్లాడారు. దీంతో ఆయన మాటలాడిన మాటలు ఒక్కసారిగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఈసీ రియాక్ట్ అయ్యింది!
ఇందులో భాగంగా పోలీసులకు ఫిర్యాదు అందండంతో కేసు నమోదయ్యింది. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎన్నికల కమిషన్ హుజూరాబాద్ ఎన్నికల అధికారులను ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశం అయ్యింది.
అవును... హుజూరాబాద్ బీఆరెస్స్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదైంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై కమలాపూర్ ఎంపీడీవో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో... ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ పాడి కౌశిక్ రెడ్డిపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదే సమయంలో... కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఆయన వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారులను ఆదేశించింది. కాగా... ప్రచారం చివరి రోజు జరిగిన ప్రచారంలో కౌశిక్ రె డ్డి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే!
ఇందులో భాగంగా... "మీరు ఓటేసి గెలిపిస్తారా? లేదంటే కమలాపూర్ బస్టాం డ్ లో మా కుటుంబమంతా ఉరేసుకోమంటరా? మీరు ఓటెయ్యకుంటే మా ముగ్గురి శవాలు చూడున్రి..! ఓటేసి దీవిస్తే జైత్రయాత్రకు వస్తా.. లేకుంటే 4వ తారీఖున మీరంతా మా శవయాత్రకు రండి" అని అన్న సంగతి తెలిసిందే.