పార్లమెంట్ కి వైసీపీ కేసులు... అజెండా ఫిక్స్!
ఏపీలో వరసబెట్టి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఆ పార్టీ సానుభూతిపరుల మీద ఫైర్ బ్రాండ్ల మీద కేసులు పెడుతున్నారు.
By: Tupaki Desk | 22 Nov 2024 4:30 AM GMTవైసీపీ తనకు చట్ట సభలలో ఉన్న బలాన్ని వాడుకుని రాజకీయంగా టీడీపీ కూటమికి గట్టి రిటార్ట్ ఇవ్వాలని చూస్తోంది. ఏపీలో వరసబెట్టి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఆ పార్టీ సానుభూతిపరుల మీద ఫైర్ బ్రాండ్ల మీద కేసులు పెడుతున్నారు.
దీంతో ఈ విషయం మీద మొదట కోర్టుకు ఆ తరువాత జాతీయ మానవ హక్కుల సంఘానికి వెళ్ళిన వైసీపీ ఇపుడు దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్ లో ఈ ఇష్యూని లేవనెత్తబోతోంది. లోక్ సభ రాజ్యసభలలో ఇదే ఇష్యూని రైజ్ చేయడం ద్వారా ఏపీలో మానవ హక్కులు భావ స్వేచ్చ అన్నవి ఏ విధంగా మంటగలుస్తున్నాయో చెప్పాలని వైసీపీ అధినాయకత్వం తన ఎంపీలకు సూచించింది.
ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలలో చేపట్టవలసిన అంశాలు చర్చించాల్సిన విషయాల గురించి వైసీపీ ఎంపీలతో జగన్ తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఏపీలో వైసీపీ నేతల మీద వరసబెట్టి పెడుతున్న కేసుల గురించి పార్లమెంట్ ఉభయ సభలలో ప్రస్తావించాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఎండీయే ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఏపీ నుంచి మంత్రులు కూడా కేంద్రంలో ఉన్నారు. మరి వైసీపీ ఎన్డీయే ప్రభుత్వానికి పక్కా ప్రతిపక్ష పార్టీగానే ఉంది. అందువల్ల పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు గట్టిగా ఈ విషయాన్ని ముందు పెట్టి మాట్లాడినా ఫలితం ఏమి ఉంటుంది అన్నది చర్చగా ఉంది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో చేస్తున్న పాలన గురించి ఆ పార్టీ విధానాల గురించి జాతీయ స్థాయిలో ఎండగట్టడమే కాకుండా కలసి వచ్చే పార్టీల మద్దతు తీసుకుని పోరాడాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
అంతే కాదు కూటమి సర్కార్ ని ఇరుకున పెట్టాడానికి అన్నట్లుగా ప్రత్యేక హోదా అస్త్రాన్ని మళ్లీ బయటకు తీస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఇదే ఇష్యూ మీద రచ్చ రాజేస్ది ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేలా చేశారు. ఇపుడు మళ్లీ అదే వ్యూహం అనుసరించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లంట్ ప్రైవేటీకరణ తో పాటు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు అన్న దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ తన అజెండాగా పెట్టుకుంది. మరి వైసీపీకి ఏ మాత్రం చాన్స్ ఉంటుంది ఆ ఎంపీలు ఏ విధంగా తన పెర్ఫార్మెన్స్ ని పార్లమెంట్ లో చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.