పురుషాంగానికి క్యాన్సర్ రావడానికి కారణాలేంటో తెలుసా?
వ్యక్తిగత పరిశుభ్రత లోపిస్తే ఈ వ్యాధి బారిన పడతారు. పెనైల్ క్యాన్సర్ కారణంగా ఫిమోసిస్ స్మోకింగ్ గా పిలిచే పురుషాంగం పై చర్మం బిగుతుగా మారుతుంది.
By: Tupaki Desk | 8 May 2024 2:30 AM GMTపురుషుల్లో పెనైల్ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరంగా తయారవుతోంది. యూరోపియన్ దేశాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. దీని బారిన పడితే అంతే సంగతి. పురుషాంగం తొలగించడం లేదా కత్తిరించడం జరుగుతుంది. దీంతో చాలా రకాల సమస్యలు వస్తాయి. పెనైల్ క్యాన్సర్ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. దీని ప్రభావం వల్ల బాధితులు కూడా పెరుగుతున్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత లోపిస్తే ఈ వ్యాధి బారిన పడతారు. పెనైల్ క్యాన్సర్ కారణంగా ఫిమోసిస్ స్మోకింగ్ గా పిలిచే పురుషాంగం పై చర్మం బిగుతుగా మారుతుంది. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. పురుషాంగం పై చర్మం లోపల సరిగా శుభ్రం చేసుకోకపోతే అక్కడ పేరుకుపోయే స్రావాలు ఉత్పత్తి అయి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కు కారణంగా నిలుస్తుంది. దీని వల్ల పెనైల్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది.
2022లో జేఎంఐఆర్ పబ్లిక్ హెల్త్ అండ్ సర్వైలెన్స్ జర్నల్ లో 43 దేశాల నుంచి సేకరించిన సమాచారంతో ఈ వ్యాధిపై అధ్యయనాలు జరిపారు. 2008 నుంచి 2012 మధ్య కాలంలో యుగాండాలో లక్ష మందికి 2.2 మంది, థాయిలాండ్ లో 1.4, అత్యల్పంగా కువైట్ లో 0.1 మంది ఈ వ్యాధి బారినట్లు గుర్తించారు. 1979 నుంచి 2009 మధ్య ఇంగ్లండ్ లో పురుషాంగ క్యాన్సర్ పెరుగుదల కనిపించింది. లక్ష మందికి 1.1 నుంచి 1.3 కి పెరిగినట్లు అధ్యయనాలు వెల్లడించాయి.
యూకే క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం పెనైల్ క్యాన్సర్ కు గురైన వారిలో 90 శాతం కంటే ఎక్కువ మందిలో పురుషాంగానికి వ్యాపించలేదు. అందువల్ల ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం వారు జీవించి ఉన్నారు. జర్మనీలో 1961 నుంచి 2012 మధ్య కాలంలో లక్ష మందికి 1.2 నుంచి 1.8 శాతం అంటే 50 శాతం పెరిగినట్లు కనుగొన్నారు.
గ్లోబల్ క్యాన్సర్ రిజిస్ట్రేషన్ ప్రిడిక్షన్ టూల్ ప్రకారం ఈ గణాంకాలు మారుతున్నాయి. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పెనైల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 77 శాతానికి పైగా పెరుగుతుందని చెబుతున్నారు. పెనైల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా 60 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి.