Begin typing your search above and press return to search.

లడ్డూ ఇష్యూలోకి సీబీఐ ?

అందువల్ల లడ్డూ వంటి సున్నితమైన అంశం మీద సీబీఐ రంగంలోకి దిగబోతోందా అన్న చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   30 Sep 2024 1:13 PM GMT
లడ్డూ ఇష్యూలోకి సీబీఐ ?
X

ఏపీ సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 18న ఎన్డీయే మీట్ లో శ్రీవారి లడ్డూ మీద చేసిన వ్యాఖ్యలు అత్యంత తీవ్రమయ్యాయి. అవి ప్రపంచాన్ని చుట్టేశాయి. ఎందుకంటే శ్రీవారు ప్రపంచ దేవుడు కాబట్టి. అందువల్ల లడ్డూ వంటి సున్నితమైన అంశం మీద సీబీఐ రంగంలోకి దిగబోతోందా అన్న చర్చ సాగుతోంది.

దేశ అత్యున్నత న్యాయస్థానం లడ్డూ ఇష్యూ మీద చేసిన కీలక వ్యాఖ్యలు చూస్తే ప్రపంచ భక్త కోటి మనోభావాలను పరిగణనలోకి తీసుకుంది అని అర్థం అవుతోంది. ఇక ముందే ఒక సీఎం హోదా చంద్రబాబు లడ్డూ కల్తీ అయింది అని చెప్పిన తీరుతో సిట్ తేల్చేది ఏముంటుంది అన్న ప్రశ్న ఉండనే ఉంది.

అంతేకాదు జూలైలో కల్తీ నెయ్యి మీద రిపోర్ట్ వస్తే రెండు నెలల తరువాత దానిని బయట పెట్టడంలోని ఆంతర్యం కూడా చర్చకు వచ్చిన విషయమే. ఇక దేశంలో ఎన్నో ల్యాబులు ఉండగా ఒక చోట నుంచే టెస్టింగులు తీసుకోవడం సెకండ ఒపీనియన్ లేకుండా దానినే ప్రమాణంగా భావించడం వంటివి చర్చకు వచ్చిన సంగతి విధితమే.

ఇవన్నీ పక్కన పెడితే శ్రీవారి లడ్డూ ప్రసాదం అన్నది ఏపీకే పరిమితమయిన ఇష్యూ కానే కాదు ప్రపంచంలో ఉన్న మొత్తం భక్తులకు సంబంధించిన విషయం. అందువల్ల భక్తులకు స్వాంతన కలగాలి అంటే దీని మీద నిష్పాక్షికమైన విచారణ జరగాలి అన్నది డిమాండ్ గా ఉంది.

దంతో సుప్రీం కోర్టు కూడా సిట్ విచరణ సరిపోతుందా లేక వేరే ఏదైన విచారణ కావాలా అని కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ ని ప్రశ్నించింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం స్పందనను కూడా చూసిన మీదట సుప్రీం కోర్టు తన తీర్పును లేదా డిరెక్షన్స్ ని వెలువరించే అవకాశం ఉంది.

మరో వైపు చూస్తే శ్రీవారి లడ్డూ వివాదం అంత ఈజీగా తీసుకోవాల్సిన అంశం అయితే కాదు, ఇది సున్నితమైనది. అందుకే రాజకీయాల్లోకి దేవుడిని లాగవద్దు అన్న వ్యాఖ్యలను సుప్రీం కోర్టు చేసింది అని అంటున్నారు. ఈ అంశంలో సీబీఐ లేదా న్యాయస్థానం జ్యుడీషియల్ విచారణను పిటిషనర్లు కోరుతున్నారు.

దాంతో అక్టోబర్ 3న జరిగే విచారణలో సుప్రీం కోర్టు ఈ అంశం మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నయని అంటున్నారు. ఇక ఈ అంశంలో రాజకీయ ప్రమేయం ఉందని కనుక నమ్మినట్లు అయితే కచ్చితంగా తటస్థ విచారణకే ఆదేశించే చాన్స్ ఉందని అంటున్నారు.

దాంతో లడ్డూ ఇష్యూలో సీబీఐ రంగంలోకి దిగుతుందా అన్న చర్చ కూడా అంతటా సాగుతోంది. ఏది ఏమైనా గత కొద్ది రోజులుగా ఏపీతో పాటు దేశ స్థాయిలో సంచలనం రేకెత్తిస్తున్న లడ్డూ ఇష్యూలో సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలే చేసింది అని భావించాలి. రాజ్యాంగ బద్ధ పదవులలో ఉన్న వారు ఎటువంటి విచారణ లేదా ఆధారాలు లేకుండా ముందే ఒక అభిప్రాయానికి వచ్చి మీడియా ముందుకు రావడం అన్నది తగదు అన్నది కూడా ఇక్కడ కనిపిస్తోంది.

అదే విధంగా ఉన్నత స్థానాలలో ఉన్న వారు చేసే వ్యాఖ్యలు కోట్ల మంది మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకుని చేస్తే బాగుంటుంది అన్నది కూడా సూచనలు ఉన్నాయి. ఇక దేవుడిని రాజకీయాల్లోకి తీసుకుని రానీయవద్దు అన్న హితవు కూడా ఉంది. ఏది ఏమైనా లడ్డూ ఇష్యూ ఇపుడు సరికొత్త మలుపు తిరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పాల్సి ఉంది.