Begin typing your search above and press return to search.

గుంటూరులో సీబీఐ మెరుపుదాడి... యూనివర్శిటీ వీసీ సహా 10 మంది అరెస్ట్!

గుంటూరులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు మెరుపుదాడికి దిగారు.

By:  Tupaki Desk   |   2 Feb 2025 6:49 AM GMT
గుంటూరులో సీబీఐ మెరుపుదాడి... యూనివర్శిటీ వీసీ సహా 10 మంది అరెస్ట్!
X

గుంటూరులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు మెరుపుదాడికి దిగారు. ఇందులో భాగంగా.. కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ (కే.ఎల్.యూ)లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో.. మెరుగైన నాక్ రేటింగ్స్ కోసం లక్షల రూపాయలు ముడుపులు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.

అవును... గుంటూరులో కే.ఎల్.యూనివర్శిటీపై సీబీఐ అధికారులు మెరుపుదాడికి దిగారు. నాక్ కు లక్షల రుపాయల మేర ముడుపులు ఇచ్చారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టగా.. అవి రుజువైనట్లు తెలుస్తోంది. దీంతో... కేఎల్ యూనివర్శిటీ వీసీ జీవీ సారథి వర్మను అధికారులు అరెస్ట్ చేశారని అంటున్నారు.

ఈ క్రమంలో గుంటూరుతో పాటు దేశవ్యాప్తంగా పలు ఉన్నత విద్యాసంస్థలపై ఏకకాలంలో ఈ దాడులు కొనసాగాయి. దీనికోసం దాదాపు 15 కు సీబీఐ అధికారుల టీమ్స్ రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. ఈ ముడుపులు అందుకున్నట్లు చెబుతున్న నాక్ టీమ్ సభ్యులపైనా సీబీఐ చర్యలకు ఉపక్రమించినట్లు చెబుతున్నారు.

కాగా.. గుంటూరులోని వడ్డేశ్వరంలో కేఎల్ యూనివర్శిటీ ఉంది. దీనికి బెస్ట్ అక్రిడేషన్ రేటింగ్ కోసం లంచం ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆ ఫిర్యాదులకు సంబంధించి కొన్ని సాక్ష్యాలు తమ చేతికి చిక్కడంతో సీబీఐ అధికారులు మెరుపుదాడులకు దిగారని అంటున్నారు.

ఈ క్రమంలో గుంటూరుతో పాటు విజయవాడ, బెంగళూరు, చెన్నై, భోపాల్, బిలాస్ పూర్, న్యూఢిల్లీ సహా దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో... యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ జీవీ సారథి వర్మతో పాటు మరో 10 మందిని అరెస్ట్ చేయగా.. మరో 14 మందిపై కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో.. సుమారు 37 లక్షల రూపాయల నగదుతో పాటు ఆరు ల్యాప్ టాప్ లు, ఒక ఐఫోన్ 16ప్రో ఫోన్, ఒక బంగారు నాణెం, అమెరికన్ టూరిస్టర్ ట్రాలీ బ్యాగ్ ను సీజ్ చేసినట్లు తెలుస్తొంది.