Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... "మేఘా"పై సీబీఐ ఎఫ్.ఐ.ఆర్. నమోదు!

స్టీల్ మంత్రిత్వ శాఖలోని ఎనిమిది మంది అధికారులపై కేసు నమోదందని తెలుస్తుంది! దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది!!

By:  Tupaki Desk   |   14 April 2024 3:15 AM GMT
బిగ్  బ్రేకింగ్... మేఘాపై సీబీఐ ఎఫ్.ఐ.ఆర్. నమోదు!
X

తాజాగా ఒక సంచలన విషయం తెరపైకి వచ్చింది. ఎన్.ఐ.ఎస్.పి. కోసం రూ. 315 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఎన్.ఎం.డీ.సీ. ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ (ఎన్.ఐ.ఎస్.పీ), స్టీల్ మంత్రిత్వ శాఖలోని ఎనిమిది మంది అధికారులపై కేసు నమోదందని తెలుస్తుంది! దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది!!

బిజినెస్ స్టాండర్డ్ కథనాల ప్రకారం... జగదల్‌ పూర్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పనులకు సంబంధించి మేఘా ఇంజినీరింగ్‌ కు చెందిన రూ. 174 కోట్ల బిల్లుల క్లియరెన్స్ కోసం సుమారు రూ.78 లక్షలు లంచం తీసుకున్నందుకు ఎన్‌.ఐ.ఎస్‌.పి, ఎన్‌.ఎం.డి.సి.కి చెందిన ఎనిమిది మంది అధికారులు, మెకాన్‌ కు చెందిన ఇద్దరు అధికారులపై కూడా సీబీఐ ఎఫ్‌.ఐ.ఆర్‌.లో పేర్కొంది!

ఎఫ్.ఐ.ఆర్. ప్రకారం... జగదల్‌ పూర్‌ సమీకృత స్టీల్‌ ప్లాంట్‌ లో ఇంటెక్‌ వెల్‌, పంప్‌ హౌస్‌, క్రాస్‌ కంట్రీ పైప్‌ లైన్‌ పనులకు సంబంధించి రూ.315 కోట్ల ప్రాజెక్టులో లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ 2023 ఆగస్టు 10న ప్రాథమిక విచారణను నమోదు చేసింది! ప్రాథమిక విచారణలో కనుగొన్న వివరాల ఆధారంగా.. మార్చి 31న దాఖలు చేసిన లంచం ఆరోపణపై సాధారణ కేసు నమోదు చేయాలని.. మార్చి 18న సిఫార్సు చేయబడింది!

ఈ సందర్భంగా ఎన్‌.ఐ.ఎస్‌.పి, ఎన్‌.ఎం.డి.సి.కి సంబంధించి సీబీఐ పేర్కొన్న ఎనిమిది మంది అధికారుల వివరాలు ఇలా ఉన్నాయని అంటున్నారు.

ఇందులో భాగంగా... రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ దాష్, డైరెక్టర్ (ప్రొడక్షన్) డీకే మొహంతి, డీజీఎం పీకే భుయాన్, డీఎం నరేష్ బాబు, సీనియర్ మేనేజర్ సుబ్రో బెనర్జీ, రిటైర్డ్ సీజీఎం (ఫైనాన్స్) ఎల్ కృష్ణ మోహన్, జీఎం (ఫైనాన్స్) కె రాజశేఖర్, మేనేజర్ (ఫైనాన్స్) సోమ్‌ నాథ్ ఘోష్ లు రూ. 73.85 లక్షలు లంచం అందుకున్నారట!

ఇదే క్రమంలో... సుభాష్ నుండి 73 ఇన్‌ వాయిస్‌ లకు వ్యతిరేకంగా ఎన్‌.ఎమ్‌.డి.సి. లిమిటెడ్ రూ. 174.41 కోట్లను ఎం.ఇ.ఐ.ఎల్‌.కు చెల్లించగా రూ.5.01 లక్షల చెల్లింపును అందుకున్నారని ఆరోపించిన మెకాన్ లిమిటెడ్‌ కు చెందిన ఇద్దరు అధికారులను.. ఎజిఎం (కాంట్రాక్ట్‌ లు) సంజీవ్ సహాయ్, డిజిఎం (కాంట్రాక్ట్‌ లు) కె ఇల్లవర్సు లుగా కూడా ఏజెన్సీ పేర్కొందని చెబుతున్నారు. ఇదే క్రమంలో... చంద్ర సంగ్రాస్, మేఘా ఇంజినీరింగ్‌ ను నిందితులుగా చేర్చారు!

కాగా.. మార్చి 21న ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం మేఘా ఇంజినీరింగ్ ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుదారుగా రెండవ స్థానంలో నిలిచింది! ఇందులో అత్యధికంగా దాదాపు రూ. 586 కోట్లను బీజేపీకి విరాళంగా ఇచ్చింది. ఇక, బీఆరెస్స్ కు రూ.195 కోట్లు, డీఎంకేకు రూ.85 కోట్లు, వైసీపీకి రూ.37 కోట్లు విరాళంగా ఇచ్చింది. కంపెనీ నుంచి టీడీపీకి దాదాపు రూ.25 కోట్లు రాగా, కాంగ్రెస్ కు రూ.17 కోట్లు వచ్చాయి!