ఒకరు 53 రోజులు - మరొకరు 16 నెలలు.. నేతల జైలు రాజకీయం..!
కానీ, తాజాగా వైసీపీ నేతల్లో నెలకొన్న అసంతృప్తులు.. పార్టీ అధినేతపై ఉన్న కోపం నేపథ్యంలో వారిని సంతృప్తి పరిచేందుకు.. వారిని దారిలో పెట్టుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
By: Tupaki Desk | 11 Oct 2024 9:30 PM GMTరెండు అగ్రపార్టీల నాయకులు..తమ తమ జైలు జీవితాలను ప్రస్తావించడం రాజకీయంగా సరికొత్త వ్యూ హానికి దారులు వేస్తున్నారనే సంకేతాలు ఇచ్చినట్టు అయింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత.. అనూహ్యంగా తన జైలు జీవితంపై సుమారు 15 నిమిషాలపాటు మీడియాకు వివరించా రు. తాను 53 రోజుల పాటు జైల్లో ఉన్నానని.. దోమలు కుట్టాయని, సరైన వసతులు కూడా లేవని, వైద్యం కూడా అందించలేదని చెప్పారు. అంతేకాదు.. అసలు తనను లేపేసేందుకు కూడా కుట్రలు జరిగాయ న్నారు.
అయితే.. ఇదివాస్తవమే అయనా.. ఇప్పుడే ఎందుకు చంద్రబాబు అంత సుదీర్ఘంగా జైలు జీవితాన్ని చెప్పు కొచ్చారన్నది ప్రశ్న. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూటమి సర్కారుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఇది వాస్తవం. అయితే.. దీనిని కొంతవరకైనా తప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగం గానే అనేక విషయాలు చెప్పుకొస్తున్నారన్నది విశ్లేషకుల మాట. కొంత సింపతీ వస్తుందని.. దీంతో ఆయన చాలా కష్టాలు పడి అధికారంలోకి వచ్చారన్న భావన రెయిజ్ అవుతుందని అనుకుంటున్నారు.
ఇదిలావుంటే.. అనూహ్యంగా అదే రోజు వైసీపీ అధినేత జగన్ కూడా.. తన జైలు జీవితం గురించి చెప్పు కొచ్చారు. వాస్తవానికి జగన్ గత పదేళ్లలో ఎప్పుడూ వ్యక్తిగతంగా తన కష్టాలు చెప్పుకొన్న పరిస్థితి లేదు. మరీముఖ్యంగా తన జైలు జీవితం గురించి అయితే.. ఆయన ఎక్కడా చెప్పలేదు. కానీ, తాజాగా వైసీపీ నేతల్లో నెలకొన్న అసంతృప్తులు.. పార్టీ అధినేతపై ఉన్న కోపం నేపథ్యంలో వారిని సంతృప్తి పరిచేందుకు.. వారిని దారిలో పెట్టుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
దీనిలో భాగంగానే తనపై సింపతీ ఏర్పడేలా ఆయన వ్యూహాత్మకంగా జైలు జీవితాన్ని ప్రస్తావించారనేది పరిశీలకుల మాట. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను. దీనికి కారణాలు అందరికీ తెలిసినవేనని.. ఇప్పుడు కూడా తనపై కుట్రలు జరుగుతున్నాయని.. ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేక పోతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా.. పార్టీపై నాయకుల్లో సింపతీ ఏర్పడేలా జగన్ ప్రయత్నిస్తున్నారని.. తద్వారా.. పోయిన ఇమేజ్‌ను, నాయకుల నైరాశ్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా ఇద్దరు కీలకనాయకులు ఇలా తమ జైలు జీవితాల గురించి చర్చించుకోవడం.. సోషల్ మీడియాలో చర్చగా మారింది.