అతివల పథకంపై వైసీపీ 'రచ్చ'.. ఎంత దారుణమంటే!
ఈ రెండు పథకాల్లోనూ తాజాగా.. కేబినెట్ భేటీలోనూ మంత్రులతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించారు.
By: Tupaki Desk | 16 July 2024 3:27 PM GMTఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తొలి నెలలోనే వచ్చీ రావడంతో పింఛన్లను పెంచేసి ఇచ్చింది. ఒక్కొక్కరికీ రూ.4000 చొప్పును టీడీపీ అధినేత చంద్రబాబు పంపిణీ చేశారు. కూటమి పార్టీలు కూడా.. ఈ పథకంలో భాగస్వామ్యమయ్యాయి. అంతకు ముందు మూడు మాసాలకు(ఏప్రిల్-జూన్) కూడా పెంచిన పింఛనును రూ.1000 చొప్పున కలిపి ఇచ్చారు. ఇక, రెండో నెలలో సాధ్యమైనంత వరకు రెండు కీలక పథకాలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
వీటిలో ప్రధానంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు డేట్ నిర్ణయించారు. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న హామీని కూడా అమలు చేసేందుకు కసరత్తు చేశారు. ఈ రెండు పథకాల్లోనూ తాజాగా.. కేబినెట్ భేటీలోనూ మంత్రులతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించారు. అయితే.. తొలి దశలో అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిపైనా తర్జన భర్జన కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
ఇక, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించే హామీపైనా చర్చించినా.. తదుపరి కేబినెట్‌లో పూర్తిగా చర్చించాలని నిర్ణయించారు. కానీ, ఇంతలోనే ఒకరిద్దరు మంత్రుల పేరుతో వారి ఎక్స్ ఖాతాల పేరుతో విపక్షం వైసీపీ నాయకులు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచి తప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని.. ప్రకటనలు అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు.
వాస్తవానికి దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఇంకా ఈ పథకంపై పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు ప్రబుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ప్రభుత్వం అధ్యయనం చేసేస్తాయిలోనే ఉంది. అయినా.. ప్రజలను ఎలా గోలా రెచ్చగొట్టే కార్యక్రమాలకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ప్రచారాలను నమ్మొద్దన్ని తాజాగా రవాణా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి ప్రకటించారు.