Begin typing your search above and press return to search.

చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ...ప్రజలలో వేరే చర్చ !

రెండు రాష్ట్రాల తెలుగు సీఎంలు కలుస్తున్నారు. ఈ నెల 6న వారు సమావేశం కాబోతున్నారు.

By:  Tupaki Desk   |   3 July 2024 5:18 AM GMT
చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ...ప్రజలలో వేరే చర్చ !
X

రెండు రాష్ట్రాల తెలుగు సీఎంలు కలుస్తున్నారు. ఈ నెల 6న వారు సమావేశం కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించి చంద్రబాబు లేఖ రాయగా దానికి రేవంత్ రెడ్డి పాజిటివ్ గా స్పందించారు. దాంతో ఈ ఇద్దరు సీఎంల భేటీ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే ఈ ఇద్దరు భేటీ దేని కోసం అన్న దాని మీదనే చర్చ సాగుతోంది. విభజన సమస్యల మీద చర్చించేందుకు ఈ భేటీ అన్నది తెలిసిందే. జటిలమైన అనేక సమస్యలను సామరస్యపూర్వకంగా చర్చించుకుందామని

రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఆహ్వానం పలికారు. ముఖా ముఖీ భేటీలో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.

రెండు రాష్ట్రాల మధ్య షెడ్యూల్ 9, 10 ఆస్తులకు సంబంధించిన పెండింగ్ సమస్యలు ఉన్నాయి. అలాగే బకాయిల విషయం ఉంది. ఇంకా నీటి ఒప్పందాల మీద సరిహద్దు విషయాల మీద కూడా చర్చించాల్సి ఉంది. అలా ఈ భేటీ సాగితే ఫలప్రదం గానే ఉంటుంది అని అంటున్నారు. కానీ ఈ భేటీ మీద వేరే విధంగా ప్రజలలో చర్చ సాగుతోందిట.

అదేంటి అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో 2015లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసు ఈ ఆగస్టులో సుప్రీం కోర్టులో హియరింగ్ కి వస్తోందని అంటున్నారు. ఈ కేసులో ఆనాటి టీడీపీ నేతగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాగే బ్రీఫ్డ్ మీ అని అప్పట్లో చంద్రబాబు వాయిస్ తో ఒక స్వరం వినిపించింది. అయితే ఈ కేసు ఇపుడు సుప్రీం కోర్టు లో విచారణకు రాబోతున్న నేపధ్యంలోనే ఈ భేటీ సాగుతోంది అన్నది తెలంగాణాలో వినిపిస్తోంది. ఆ కేసు విషయమే ఈ భేటీ అని తెలంగాణావాదులు అంటున్నారట.

ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీయేలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పాత్రలో ఉన్నారు. దాంతో ఈ కేసు విషయంలోనే భేట్లో చర్చ ఎంతో కొంత ఉంటుందా అన్నది కాంగ్రెస్ వాదులలోనూ చర్చగా ఉందిట. కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నట్లే లెక్క. కాంగ్రెస్ ఎన్డీయేకు బద్ధ శత్రువు. పైగా తెలంగాణాలో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది.

ఇక చంద్రబాబు అదే ఎన్డీయే రక్షకుడిగా ఉన్నారు. ఇలా పొలిటికల్ ఈక్వేషన్లు అన్నీ మారిపోయిన వేళ జరుగుతున్న ఈ భేటీ రాజకీయంగాను కేక పుట్టించేదే అని అంటున్నారు. చంద్రబాబు ఇన్విటేషన్ ని రేవంత్ రెడ్డి మన్నించి రావడం మంచిదే అయినా అందులో స్వామి కార్యమూ స్వకార్యమూ ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోందిట. మరి ఈ భేటీ తరువాతనే ఏమి జరిగింది అన్నది గుసగుసలు గానైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.