జగన్ 7గురికి ఛాన్స్ ఇస్తే... బాబు 8 మందికి ఇచ్చారు!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
By: Tupaki Desk | 12 Jun 2024 9:59 AM GMTఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు మరో 24 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేబినెట్ కూర్పు ఆసక్తికరంగా ఉంది. ఈ విషయంలో సీనియర్ల కంటే కొత్తతరానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే క్రమంలో సామాజికవర్గాల వారీగా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తుంది.
అవును... ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ కేబినెట్ లో 17మంది కొత్తవారు కాగా... పవన్ కల్యాణ్ తో పాటు తొమ్మిదిమంది మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టినవారు ఉన్నారు. ఇక పార్టీల వారీగా చూస్తే టీడీపీ నుంచి 20 మందికి మంత్రులుగా అవకాశం రాగా.. జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం దక్కింది.
ఇక ప్రధానంగా సామాజికవర్గాల వారీగా చంద్రబాబు కేబినెట్ ని పరిగణలోకి తీసుకుంటే... ఇందులో మొత్తం 13మంది ఓసీలు ఉండగా.. బీసీలు 8మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, మైనారిటీ ఒకరికి చోటు దక్కింది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో 7గురు బీసీలకు మంత్రులుగా అవకాశం ఇవ్వగా.. చంద్రబాబు మాత్రం 8మంది బీసీలకు అవకాశం ఇవ్వడం గమనార్హం.
కొలుసు పార్థసారథి - బీసీ యాదవ
సత్యకుమార్ - బీసీ యాదవ
కొల్లు రవీంద్ర - బీసీ మత్స్యకార
కొండపల్లి శ్రీనివాస్ - బీసీ తూర్పు కాపు
అచ్చెన్నాయుడు - బీసీ కొప్పుల వెలమ
అనగాని సత్యప్రసాద్ - బీసీ గౌడ
వాసంశెట్టి సుభాష్ - బీసీ శెట్టిబలిజ
సవిత - బీసీ కురుబ