Begin typing your search above and press return to search.

24 మందితో చంద్రబాబు కొత్త టీం... 17మంది ప్రత్యేకత ఇదే!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.

By:  Tupaki Desk   |   12 Jun 2024 9:49 AM GMT
24 మందితో చంద్రబాబు కొత్త టీం... 17మంది ప్రత్యేకత ఇదే!
X

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయంతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. చంద్రబాబుతో పాటు మరో 24మంది చేత గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.

అవును... ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టీస్ ఎన్వీ రమణ, చిరంజీవి, రజనీకాంత్ దంపతులతోపాటు రాంచరణ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కొత్త కేబినెట్ లో జనసేన నుంచి ముగ్గురికి మంత్రిపదవులు దక్కగా.. బీజేపీ నుంచి ఒకరిని మంత్రిపదవి వరించింది. ఇందులో భాగంగా.. జనసేన నుంచి పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు అవకాశం దక్కింది. ఇక బీజేపీ విషయానికొస్తే... ఆ పార్టీ నుంచి సత్యకుమార్ యాదవ్ కు ఛాన్స్ దక్కింది. ఈ క్రమంలోనే ప్రమాణస్వీకారం చేసిన వారిలో 17 మంది కొత్తవారే కావడం గమనార్హం.

ఈ సందర్భంగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారి జాబితా ఈ విధంగా ఉంది.

పవన్ కల్యాణ్ (పిఠాపురం)

నారా లోకేష్ (మంగళగిరి)

అచ్చెన్నాయుడు (టెక్కలి)

నాదెండ్ల మనోహర్‌ (తెనాలి)

సత్యకుమార్‌ (ధర్మవరం)

కొల్లు రవీంద్ర (మచిలీపట్నం)

వంగలపూడి అనిత (పాయకరావుపేట)

నిమ్మల రామానాయుడు (పాలకొల్లు)

పొంగూరు నారాయణ (నెల్లూరు సిటీ)

ఎన్‌.ఎం.డీ ఫరూక్‌ (నంద్యాల)

పయ్యావుల కేశవ్‌ (ఉరవకొండ)

ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు)

అనగాని సత్యప్రసాద్‌ (రేపల్లె)

కొలుసు పార్థసారథి (నూజివీడు)

గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి)

డోలా బాల వీరాంజయనేయ స్వామి (కొండపి)

గుమ్మిడి సంధ్యారాణి (సాలూరు)

బీసీ జనార్దన్‌ రెడ్డి (బనగాలపల్లి)

కందుల దుర్గేష్‌ (నిడదవోలు)

సవిత (పెనుకొండ)

వాసంశెట్టి సుభాష్‌ (రామచంద్రపురం)

టీజీ భరత్‌ (కర్నూలు సిటీ)

మండపల్లి రామ్‌ ప్రసాద్‌ రెడ్డి (రాయచోటి)

కొండపల్లి శ్రీనివాస్‌ (గజపతినగరం)