Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు షాక్.. "హౌస్ రిమాండ్" పిటిషన్‌ తిరస్కరణ!

అవును... చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌ పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్‌ కస్టడీ పిటిషన్‌ ను న్యాయమూర్తి తిరస్కరించారు.

By:  Tupaki Desk   |   12 Sep 2023 11:49 AM GMT
చంద్రబాబుకు షాక్.. హౌస్  రిమాండ్ పిటిషన్‌  తిరస్కరణ!
X

టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్‌ వేయగా, హౌస్‌ రిమాండ్‌ తదితర అంశాలతో చంద్రబాబు పిటిషన్లు వేశారు. వీటిపై వాదనలు ముగిశాయి. దీంతో ఈ హౌస్ రిమాండ్ పిటిషన్ పై తాజాగా తీర్పు వెలువడింది. ఆ పిటిషన్ తిరస్కరించబడింది.

అవును... చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌ పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్‌ కస్టడీ పిటిషన్‌ ను న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ పిటిషన్‌ పై సోమవారం, మంగళవారం సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామని ఏఏజీ సుధాకర్ రెడ్డి న్యాయస్థానానికి తెలిపారు.

ఇదే సమయంలో జైల్లోనే కాకుండా జైలు పరిసర ప్రాంతాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే క్రమంలో 24 గంటలూ పోలీసులు విధుల్లోనే ఉంటున్నారని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామని కోర్టుకు తెలిపారు ఏఏజీ! ఇదే సమయంలో సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశం ఉండటం వల్ల హౌస్‌ రిమాండ్‌ కు అనుమతించవద్దని న్యాయస్థానాన్ని కోరారు.

మరోవైపు చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. ఆయనకు జైలులో ప్రమాదం పొంచి ఉందని, ప్రాణ హాని ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తుంది. కరుడుగట్టిన నేరస్థులు, ఆయుధాలు వాడిన నేరస్థులు అదే జైల్లో ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో... జైల్లో నేరస్తులు ఉండక స్వామీజులు ఉంటారా అంటూ ఏఏజీ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇలా సాగిన వాదనల అనంతరం ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి... చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌ ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించారు.