Begin typing your search above and press return to search.

చంద్రబాబు సర్ ప్రైజ్ లతో పవన్ ఉక్కిరిబిక్కిరి

కట్ చేస్తే.. ఇప్పుడు తన తీరుతో చంద్రబాబు పే బ్యాక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   18 Jun 2024 5:28 AM GMT
చంద్రబాబు సర్ ప్రైజ్ లతో పవన్ ఉక్కిరిబిక్కిరి
X

కుదురుతుందా? లేదా? వర్కువుట్ అయినా ఎంత కాలం? చంద్రబాబును పవన్ ఎంతవరకు భరిస్తాడు? బాబుకు బాగా అలవాటైన యూజ్ అండ్ త్రో తీరుకు పవన్ తాజా బాధితుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే విమర్శలు చంద్రబాబును ఉద్దేంచి విమర్శల విషాన్ని వెదజల్లుతున్నారు చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు. అయితే.. వీటికి నోటితో కాకుండా చేతలతో సమాధానం ఇస్తున్న టీడీపీ అధినేత తీరు చివరకు జనసేనాని పవన్ కల్యాణ్ ను సైతం ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు మీద పూర్తిస్థాయి నమ్మకం పవన్ కల్యాణ్ కు ఉన్నప్పటికీ.. ఆయన వ్యవహరిస్తున్న తీరు తాను ఎంత మాత్రం ఊహించలేదన్న మాట తన సన్నిహితులతో పవన్ అన్నట్లుగా తెలుస్తోంది.

ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటు మొదలు అధికారంలోకి వచ్చినంత వరకు చంద్రబాబు - పవన్ మధ్య కించిత్ భేదాబిప్రాయాలకు చోటు లేకుండా ఇద్దరు వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ సీట్ల కేటాయింపులోనూ తన వర్గం నుంచి ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పటికీ.. వాస్తవిక ధోరణిని మిస్ కాకుండా తన బలానికి తగ్గట్లు సీట్లు అడగటం బాబును ఎక్కడో టచ్ చేసిందంటున్నారు. అంతేకాదు.. బీజేపీతో పొత్తు కుదిర్చే మిషన్ లో సీట్ల కేటాయింపు ఇష్యూ వస్తే.. కూటమి కోసం తనకు కేటాయించిన సీట్లను సైతం త్యాగం చేయటం.. ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా పవన్ వ్యవహరిస్తున్న తీరు అప్పట్లో చంద్రబాబును సర్ ప్రైజ్ చేసినట్లుగా చెబుతారు.

కట్ చేస్తే.. ఇప్పుడు తన తీరుతో చంద్రబాబు పే బ్యాక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసినప్పటికీ.. తన రాజకీయ చరిత్రలో తానెప్పుడూ చూడని ఎన్నికల విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు.. ఇదంతా తన ఒక్కడి క్రెడిట్ కాదన్న విషయాన్ని నిద్రలో కూడా మర్చిపోలేదంటున్నారు. అన్నింటికి మించి తనను జైల్లో ఉంచిన వేళ.. అందరూ దూరంగా ఉండి.. దగ్గరకు రావటానికి భయపడుతున్న వేళ.. పవన్ ముందుకు వచ్చిన వైనం.. ఆ సందర్భంగా ప్రదర్శించిన తెగువ చంద్రబాబును పూర్తిగా మార్చేసిందంటున్నారు.

ఈ మార్పు ఇప్పుడు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అందుకే గతంలో మరే మిత్రుడి విషయంలోనూ ప్రదర్శించని ప్రేమాభిమానాన్ని పవన్ మీద కురిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. మంత్రివర్గంలో ఇష్టమొచ్చిన శాఖల్ని.. మంత్రి పదవుల్ని తీసుకోవాలన్న చంద్రబాబు రిక్వెస్టును సున్నితంగా రిజెక్టు చేస్తూ.. మీ ఇష్టమన్న మాటతో పాటు.. తనకు కావాల్సిన శాఖల విషయంలో పవన్ వ్యవహరించిన తీరు చంద్రబాబును ఆశ్చర్యానికి గురి చేసినట్లు చెబుతున్నారు.

పవన్ లోని కొత్త తరం నాయకుడ్ని చూసిన చంద్రబాబు ఫిదా అయ్యారని చెబుతున్నారు. మిత్రధర్మాన్ని మిస్ కాకుండా.. ప్రతి అంశంలోనూ జనసేనకు వాటా ఇవ్వాలన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సవాలచ్చ అంశాలు తెర మీదకు వస్తాయి. ఇలాంటి వేళలో.. మిత్రుడిగా షేరింగ్ ఇవ్వాల్సిన పదవుల విషయంలో సొంత పార్టీలో ఎంత పోటీ ఉన్నా.. ఫిఫ్టీ - ఫిఫ్టీ దామాషాలో నామినేటెడ్ పోస్టులు కేటాయింపునకు చంద్రబాబు డిసైడ్ కావటమే కాదు.. అదే తీరును ప్రదర్శిస్తూ జనసేనానికి స్వీట్ షాకులు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.

పాలనా పరమైన అంశాల్లో పవన్ కు పెద్దగా అవగాహన లేనప్పటికీ.. కీలకమైన నామినేటెడ్ పోస్టులు.. వాటి ప్రాధాన్యత గురించి వివరిస్తూ.. నీ పార్టీ తరఫు వారికి కేటాయించండన్న రిక్వెస్టులు బాబు నుంచి వరుస పెట్టి వస్తున్నట్లుగా చెబుతున్నారు. సాధారణంగా కూటమి పాలనలో ప్రతిది కాకుండా చాలా వరకు అడిగితే కానీ ఇవ్వన్నట్లుగా వ్యవహారశైలి ఉంటుంది. అది కూడా బలానికి తగినట్లుగా దామాషా ఉంటుంది. అందుకు భిన్నంగా బాబు తీరు ఉంటుందని చెబుతున్నారు. నామినేటెడ్ పదవులు.. కీలక ఎంపికల విషయంలో ఫిఫ్టీ - ఫిప్టీగా చంద్రబాబు డిసైడ్ చేయటమే కాదు.. మీ తరఫు ఎంపికలను చెప్పాలంటూ పవన్ కు సూచనలు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి తీరును చంద్రబాబు నుంచి పవన్ ఏ మాత్రం ఊహించలేదని.. చంద్రబాబు తీరుతో ఫుల్ హ్యాపీగా ఉన్న జనసేనాని కారణంగా రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య బంధం అంతకంతకూ బలపడుతోందన్న మాట వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే.. రెండు పార్టీల నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు.. సానుభూతిపరుల మధ్య కూడా అనుబంధం అంతకంతకూ పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.