బాబు, పవన్, లోకేష్... సోషల్ మీడియాలో 23 రచ్చ వైరల్!
గతకొంతకాలంగా 23వ నెంబర్ ను చంద్రబాబును విడదీసి చూడలేని పరిస్థితి అనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Sep 2023 4:16 AM GMTగతకొంతకాలంగా 23వ నెంబర్ ను చంద్రబాబును విడదీసి చూడలేని పరిస్థితి అనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల అనంతరం వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలోకి అప్రజాస్వామికంగా ఆపరేషన్ ఆకర్ష పేరున చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ఫలితాలు ఆ సంఖ్యను రిపీట్ చేశాయి.
2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన అనంతరం వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కండువాలు కప్పి తన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. మంత్రి పదవులు కూడా అప్పగించారు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు 175 స్థానాలకు గానూ 23 స్థానాలలో గెలిచారు. పైగా 2019 ఎన్నికల ఫలితాలు కూడా 23 వతేదీ మే నెలలో ప్రకటించబడ్డాయి.
అక్కడ నుంచి ఈ 23 వ నెంబర్ సెంటిమెంట్ గా మారిపోయింది. ఏపీ రాజకీయాల్లో ఒక భాగం అయిపోయింది. ఈ క్రమంలో తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఆయనకు కేటాయించిన నెంబర్ 7691 కూడా 23 (7+6+9+1=23) ని సూచిస్తుంది. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో చంద్రబాబుకు ఈ 23 కి ఉన్న మరిన్ని సంబంధాలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇందులో భాగంగా... వైఎస్ జగన్ ఖైదీ నెంబర్, చంద్రబాబు ఖైదీ నెంబర్ మధ్య వ్యత్యాసం మొత్తం 23 (7691 - 6093 = 1598 = 1+5+9+8 = 23)! ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్ ల పుట్టిన తేదీల మొత్తం కూడా 23 కావడం గమనార్హం.
అవును... చంద్రబాబు పుట్టిన తేదీ... 20-4-1950 (2+0+4+1+9+5+0=21) ==> 2+1=3
లోకేష్ పుట్టిన తేదీ... 23-1-1983 (2+3+1+1+9+8+3=27) ==> 2+7=9
పవన్ కళ్యాణ్ పుట్టిన తేదీ 2-9-1971 (2+9+1+9+7+1=29) ==> 2+9=11
వీటిని కలిపితే... 3+9+11=23
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చంద్రబాబుకు పవన్ కలిసినా కూడా టోటల్ 23 అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ను ఇటీవల పవన్ కల్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. ములాకత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసే పోటీచేస్తాయని ప్రకటించారు.