కూటమి మంత్రులకు చంద్రబాబు బెస్ట్ ప్రిఫరెన్స్!
ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఆయా పార్టీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి ప్రాధాన్యం ఇచ్చారు.
By: Tupaki Desk | 14 Jun 2024 10:23 AM GMTఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఆయా పార్టీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 25 మంది మంత్రుల్లో ముగ్గురు జనసేన, ఒకరు బీజేపీల నుంచి ఉన్న విషయం తెలి సిందే. వీరికి దక్కిన శాఖలను గమనిస్తే.. సీఎం చంద్రబాబు తన కూర్పు విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారని తెలుస్తోంది. జనసేన నుంచి పార్టీ అధినేత పవన్, ఆ పార్టీ ముఖ్య నాయకుడు.. నాదెం డ్ల మనోహర్, మరో నేత కందుల దుర్గేష్‌లకు మంత్రి పదవి ఇచ్చారు. పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
వీరికి ఇచ్చిన శాఖలను చూస్తే.. అత్యధిక ప్రాధాన్యం ఉన్నవే కావడం గమనార్హం. డిప్యూటీ సీఎం పవన్‌కు.. గ్రామీణ పరిపాలనను పూర్తిగా చేతిలో పెట్టారు. అదేవిధంగా కీలకమైన అటవీ శాఖ, పర్యావరణం వంటివి కూడా ఆయనకే అప్పగించారు. అలాగే.. నాదెండ్ల మనోహర్‌కు.. పౌరసరఫరాల శాఖతోపాటు.. వినియోగదారుల వ్యవహారాల శాఖను అప్పగించారు. ఈ రెండు కూడా.. ప్రభుత్వానికి కీలకమైన విషయాలే కావడం గమనార్హం.
అలాగే.. జనసేన మరో మంత్రి కందుల దుర్గేష్‌కు పర్యాటక శాఖతోపాటు.. సినిమాటో గ్రఫీ శాఖను కూడా అప్పగించారు. ఈ రెండు రాష్ట్ర పాలనలో కీలకమైనవే. పర్యాటకంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయడం ద్వారా.. ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంది. సినీమా టో గ్రఫీ ద్వారా.. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీని డెవలప్ చేసే అవకాశం .. కూడా ఉంది. ఇక, బీజేపీ నాయకుడు, ధర్మవరం ఎమ్మెల్యే , మంత్రి సత్యకుమా ర్ యాదవ్‌కు.. అత్యంత కీలకమైన శాఖను అప్పగించారు చంద్రబాబు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖలను సత్యకుమార్ యాదవ్‌కు అప్పగించారు. రాష్ట్రానికి ఈ శాఖ అత్యంత కీలకం. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. అదేవిధంగా ఆరోగ్య శ్రీపథకాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా ఈయనపైనే ఉంది. సో.. కూటమి పార్టీల విషయంలో చంద్రబాబు చేసిన శాఖల కేటాయింపు.. అద్భుతమేనని చెప్పాలి.