Begin typing your search above and press return to search.

వైరల్ పిక్... బాబుకి దళితులంటే ఎంత గౌరవమో తెలుసా?

సంక్రాంతి సంబరాల్లో భాగంగా నారావారిపల్లెకు వెళ్లిన చంద్రబాబు తాజాగా చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు పులపర్తి నాని ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు.

By:  Tupaki Desk   |   16 Jan 2024 5:45 AM GMT
వైరల్  పిక్... బాబుకి దళితులంటే ఎంత గౌరవమో తెలుసా?
X

చంద్రబాబుకు ఎస్సీలంటే ఏమాత్రం గౌరవం ఉండదని.. వారిని గౌరవించే విషయంలో చంద్రబాబు ఎప్పుడూ నిర్లక్ష్యమే వహిస్తుంటారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారు. ఎన్నికల వేళ మాత్రమే చంద్రబాబుకు బడుగు బలహీనవర్గాలపై ప్రేమ పుట్టుకొస్తుంటుందని.. అధికారంలోకి వచ్చిన తర్వాత "తోకలు కత్తిరిస్తా" అనే మాటలు చెబుతుంటారని అంటున్నారు.

ఈ విమర్శలకు తగ్గట్లుగానే చంద్రబాబు ప్రవర్తన, మాటతీరు ఉంటాయని చెబుతుంటారు పరిశీలకులు. బడుగు బలహీనవర్గాలని చెప్పే సామాజికవర్గాలను చెందిన ప్రజానికంపై చంద్రబాబుకు చిన్నచూపు ఉంటుందని అంటారు రాజకీయ ప్రత్యర్థులు.

ఇదే సమయంలో... మాజీ మంత్రి జేఆర్‌ పుష్పరాజ్‌ ను పక్కగదిలో కూర్చోబెట్టి టీజే వెంకటేష్‌ తో మాటలు సాగించి రాజ్యసభ సీటు అమ్ముకున్నారని.. వర్ల రామయ్యకి ఆఖరిలో బలవంతంగా తిరుపతి ఎంపీ సీటు కేటాయించి బలి పశువును చేశారని విమర్శలు వినిపిస్తుంటాయి! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు పులపర్తి నాని ఇంట్లో జరిగిన పత్రికా సమావేశంలో బాబు వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

అవును... సంక్రాంతి సంబరాల్లో భాగంగా నారావారిపల్లెకు వెళ్లిన చంద్రబాబు తాజాగా చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు పులపర్తి నాని ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా తనకు ఒకవైపున 2019 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో 41,755 ఓట్ల తేడాతో పరాజయం పాలైన పులపర్తి నానిని కుర్చోబెట్టుకున్నారు చంద్రబాబు.

మరోవైపున పలమనేరు నియోజకవర్గం నుంచి 2014లో వైసీపీ తరుపున గెలిచి, అనంతరం 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీచేసి 32,246 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై ఓడిపోయిన అమర్నాథ్ రెడ్డిని కూర్చోబెట్టుకున్నారు. అయితే... నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా పనిచేసిన దళిత మాజీ మంత్రి పరస రత్నంను మాత్రం వెనుక నిలబెట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది.

ఒక దళిత నాయకుడిని, మాజీ మంత్రిని, సీనియర్ లీడర్ ని వెనుక నిలబెట్టిన చంద్రబాబు వైఖరిని దళిత సంఘాలు, దళిత నేతలు, దళిత ప్రజానికం, బడుగు బలహీనవర్గాల నేతలు తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ విషయాన్ని దళిత ప్రజానికం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలుస్తుంది.

దీంతో... ఇది బడుగు బలహీనవర్గాల విషయంలో చంద్రబాబు తాలూకు అసలు సిసలు ఆలోచనా విధానం అనే కామెంట్లూ తదనుగుణంగా వినిపిస్తున్నాయి. దీంతో... ఆయన పక్కన కుర్చోబెట్టుకున్నవారిద్దరూ.. పరస రత్నం కంటే రాజకీయంగా ఏ విధంగా గొప్పనాయకులు అనేది చంద్రబాబుకే తెలియాలనే మాటలు తెరపైకి వస్తున్నాయి.

ఈ సమయంలో... ఇది కేవలం అగ్రవర్ణాలమని చెప్పుకునే సామాజికవర్గాలకు చెందిన కొందరి కుల అహంకారపూరిత ఆలోచనా విధానాలకు ఉదాహరణలని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా... తాజాగా వైరల్ అవుతున్న ఈ ప్రెస్ మీట్ సందర్భంగా దళిత మాజీ మంత్రికి జరిగిన అవమానానికి సంబంధించిన పిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.